విశాల్ సినిమాలో విలన్ గా రెజీనా... ఎవరూ ఊహించని పాత్రలో

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుని రెజీనా కాసాండ్రా సొంతం చేసుకుంది.

ఈ అమ్మడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడం గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు.

అలాగే ఆరంభంలో బాగానే అవకాశాలు వచ్చిన తరువాత అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో కూడా తన అదృష్టం పరీక్షించుకుంది.

అక్కడ తాను నటించిన సినిమా బాగానే ఆకట్టుకున్న హీరోయిన్ గా అవకాశాలు మాత్రం పెంచుకోలేకపోయింది.ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన మాతృభాషలో సినిమాల మీద దృష్టిపెట్టింది.

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో అమ్మడు నెగిటివ్ రోల్స్ కి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.ఇప్పటికే తెలుగులో ఎవరు, 7 సినిమాలలో నెగిటివ్ పాత్రలలో రెజీనా ఆకట్టుకుంది.అయితే ఎవరు సినిమా క్రెడిట్ అంతా అడవి శేష్ కి వెళ్లిపోవడంతో ఈ భామకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.7 సినిమా డిజాస్టర్ అవడంతో ఈమె పాత్ర బయటకి రాలేదు.అయితే ఈ సారి మాతృభాషలో మరోసారి పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

విశాల్ హీరో గా ఆనందన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా సైబర్ క్రైమ్స్ నేపధ్యంలో చక్ర సినిమా వస్తుంది.ఈ సినిమాలో రెజీనా పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

హ్యాకింగ్ చేస్తూ వ్యవస్థని భయపెట్టే సైబర్ క్రిమినల్ పాత్రలో రెజీనా కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు.మరి అది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు