బడ్జెట్ ధరలో మొబైల్ కొనాలంటే ఎక్కువమందికి ఫస్ట్ ఆప్షన్ రెడ్‌మీ ఫోన్లే నిలుస్తాయి.ఎందుకంటే ఈ బ్రాండ్ తక్కువ ధరలకే అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఫోన్స్ అందిస్తుంది.
కాగా జనవరి 11న ఈ కంపెనీ రెడ్‌మీ నోట్ 12 5జీ సిరీస్ ఇండియాలో లాంచ్ చేసింది.ఈ మొబైల్ కనీవినీ ఎరుగని రీతిలో అమ్మకాలను నమోదు చేసింది.భారతీయులు ఈ మొబైల్ రిలీజ్ అయిన వెంటనే ఎగబడి కొనేయడంతో వారంలో రోజుల్లో రూ.300 కోట్ల విలువైన రెడ్‌మీ నోట్ 12 ఫోన్స్ అమ్ముడయ్యాయి.ఈ విషయాన్ని తాజాగా కంపెనీ వెల్లడించింది.దీన్ని బట్టి ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

ఈ రికార్డు క్రియేట్ అయిన సందర్భంగా షియోమీ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనూజ్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ… “రెడ్‌మీ నోట్ 12 సిరీస్ లాంచ్ మాకు చాలా ముఖ్యమైనది.ఎందుకంటే దానితో మేం భారతదేశంలో రెడ్‌మీ నోట్ సిరీస్‌తో ఎనిమిది అద్భుతమైన సంవత్సరాలను పూర్తి చేసాం.” అని అన్నారు.రెడ్‌మీ నోట్ 12 5జీ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 12 5జీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో+ 5జీ.వీటిలో రెడ్‌మీ నోట్ 12 5జీ అనే మూడు ఫోన్లు రిలీజ్ అయ్యాయి.

రెడ్‌మీ నోట్ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 200MP కెమెరాతో వస్తుంది.ఇది భారతదేశంలో రెడ్‌మి నోట్‌లో మొదటిసారిగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది.ఈ ఫోన్ల ధరలు రూ.18 వేలు నుంచి రూ.30 వేలు రేంజ్ లో ఉన్నాయి.







