తెలుగు చిత్ర పరిశ్రమకు కమెడియన్ గా పరిచయమై అనంతరం హీరోగా మారిన వారిలో కలర్ ఫోటో హీరో సుహాస్ ఒకరు.ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుహాస్ ప్రస్తుతం రైటర్ పద్మభూషణ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
అయితే ఈ సినిమా నుంచి తాజాగా థియేటర్ ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేయడంతో ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇక ఈ ట్రైలర్ పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఇద్దరి నిర్మాతలను ఈయన టాగ్ చేస్తూ.మీరు ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనీ చెప్పడమే కాకుండా నటుడు సుహాస్ హీరోయిన్ టీనా శిల్ప రాజ్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

ఈ సినిమా చూడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ మహేష్ బాబు ట్వీట్ చేయడంతో మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ కి సుహాస్ రిప్లై ఇచ్చి తన ఆనందాన్ని తెలియచేశారు.ఈ సందర్భంగా సుహాస్ రిప్లై ఇస్తూ ఒకప్పుడు మీ పోకిరి సినిమా విడుదలైనప్పుడు విజయవాడలోని అలంకార్ థియేటర్లో టికెట్ల కోసం చొక్కా చింపుకున్నాను.

ఇప్పుడు మా గురించి మీరు ట్విట్ చేయడంతో ఇది చూసి నా చొక్కా నేనే చింపుకొని అంత ఆనందం వేస్తోంది.థాంక్యూ సో మచ్ సర్ హ్యాపీయేస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ ఈయన మహేష్ బాబు ట్వీట్ కి రిప్లై ఇచ్చి సంతోషాన్ని తెలియజేశారు.ప్రస్తుతం సుహాస్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







