ప్రస్తుతం స్మార్ట్ టీవీ( Smart TV ) లేని ఇల్లు చాలా అరుదు.ప్రముఖ స్మార్ట్ టీవీ కంపెనీలు మధ్యతరగతి బడ్జెట్లోనే సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలను విడుదల చేస్తూనే ఉన్నాయి.
ఈ కోవలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షియోమీ కి చెందిన రెడ్ మీ స్మార్ట్ టీవీ తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అయింది.ఈ టీవీ కి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
రెడ్ మీ ఫైర్ 4కే టీవీ( Redmi Fire 4K TV ) అనేది అమెజాన్ ఓఎస్ ద్వారా పనిచేస్తుంది.అమెజాన్ తో పాటు ఎంఐ వెబ్సైట్లలో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది.అయితే ఇంకా విక్రయ తేదీని మాత్రం కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
రెడ్ మీ ఫైర్ 4కే టీవీ 43 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది.
ఇందులో వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ తో 4కే అల్ట్రా హెచ్డి రిజల్యూషన్ డిస్ ప్లే తో వస్తుంది.ఈటీవీలో 24 వాట్స్ స్పీకర్లు, డాల్బీ ఆడియో( Dolby Audio ) తో పాటు డీటీఎస్ వెర్షన్లకు సపోర్ట్ చేస్తుంది.
ఈటీవీ వర్చువల్ ఎక్స్ టెక్నాలజీని కలిగి ఉంది.క్వాడ్ కోర్ ఏ 55 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది.సూపర్ స్లిమ్ డిజైన్ తో మరింత ఆకర్షణీయకంగా కనిపిస్తుంది.అమెజాన్ తో భాగస్వామ్యం కారణంగా ఈ టీవీ అలెక్సాతో వస్తుంది.
ఇక బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, డ్యూయల్- బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది.అంతే కాకుండా ఇందులో పిక్చర్ ఇన్ పిక్చర్ టెక్నాలజీని కూడా పొందుపరిచారు. ఈ టీవీ ధర రూ.26999 గా ఉంది.అయితే లాంచింగ్ తర్వాత పరిమిత సమయం వరకు ఆఫర్ రూపంలో రూ.24999 కే పొందవచ్చు.