ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘రెడ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది.ఇక ఈ సినిమాకు తొలిరోజే మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సంక్రాంతి బరిలో వచ్చిన క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్, మాస్టర్ చిత్రాల్లో క్రాక్, రెడ్ చిత్రాలు చూసేందుకే ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఓటేశారు.దీంతో రెడ్ చిత్ర కలెక్షన్లు నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి.
రామ్ డ్యుయెల్ రోల్ యాక్షన్, కిషోర్ తిరుమల సస్పెన్స్ థ్రిల్లర్ కథ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి.దీంతో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.13.59 కోట్ల మేర షేర్ వసూళ్లు రాబట్టింది.కరోనా సమయంలో సగం అక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నా, ఇలాంటి కలెక్షన్లు రావడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుందని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్‌కు చాలా దగ్గరకు వచ్చేసిన రెడ్ చిత్రం టోటల్ రన్లో లాభాలతో ముగుస్తుందని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
కాగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 4.90 కోట్లు
సీడెడ్ – 2.45 కోట్లు
గుంటూరు – 0.96 కోట్లు
వైజాగ్ – 1.39 కోట్లు
ఈస్ట్ – 0.98 కోట్లు
వెస్ట్ – 0.91 కోట్లు
కృష్ణా – 0.93 కోట్లు
నెల్లూరు – 0.58 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 13.1 కోట్లు
యుఎస్ – 0.09 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 0.40 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.13.59 కోట్లు