రెడ్ అలెర్ట్: ముంబైలో రెండు రోజులు అన్నీ బంద్!

మహారాష్ట్ర రాజధాని ముంబై వాసులను ఒకవైపు కరోనా మహమ్మారి కలవరపెడుతుంటే మరోవైపు భారీ వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

భారత వాతావరణ శాఖ ముంబై లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.

తూర్పు కొంకణ్‌, థానే జిల్లాలతో పాటు ముంబైలో కూడా భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

నిన్న కురిసిన భారీ వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడగా మరికొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయిన నీరు చెరువులను తలపిస్తోంది.ఐఎండీ టైమ్స్ ఆఫ్ ఇండియా, సమతా నగర్ పోలీస్ స్టేషన్, హైవే ముంబై, ఉత్తర కొంకణ్ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని పేర్కొంది.

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్ప పీడనం వల్ల ముంబైలో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం గత 14 గంటల్లో 230 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

Advertisement

భారీ వర్షాల వల్ల నగరంలోని పలు సేవలకు అంతరాయం కలిగింది.మహారాష్ట్ర ప్రభుత్వం ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా ఇతర కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.

వర్షాల వల్ల పలు రైళ్లను సైతం నిలిపివేసినట్లు సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు