రికార్డ్: 14 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్న భారతీయ బాలుడు..!

మన భారతీయుడి ఘనత మరోసారి ప్రపంచానికి తెలిసింది.

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో గోవా కు చెందిన లియోన్ లూక్ మెన్డోంకా అనే 14 ఏళ్ల బాలుడు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో పోటీ చేసి విజయం సాధించాడు.

ఇటలీలో జరిగిన టోర్నమెంట్లో లియోన్ లూక్ మెన్డోంకా తన చివరి ఆటను గెలిచి గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.ఇలా గెలుపు సాధించి గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలవడం అనేది మన భారతదేశానికి చెందిన 67 వ్యక్తిగా ఈ బాలుడు నిలిచాడు.

లియోన్ కేవలం 14 సంవత్సరాల, 9 నెలల, 17 రోజుల వయస్సులో ఉండగానే ఈ అరుదైన టైటిల్ ను కైవసం చేసుకోవడం విశేషం.దీంతో గోవా నుండి గ్రాండ్ మాస్టర్ టైటిల్ దక్కించుకున్న రెండో ఆటగాడిగా లియోన్ లూక్ మెన్డోంకా రికార్డుకెక్కాడు 2020 అక్టోబరులో ఇటలీలో జరిగిన రిగో చెస్ GMRR టోర్నమెంట్లో లియోన్ తన మొదటి విజయాన్ని నమోదు చేయగా, బుడాపెస్ట్ లో జరిగిన టోర్నమెంట్ లో విజయం సాధించి కేవలం 21 రోజుల్లోనే రెండవ మ్యాచ్ నెగ్గాడు.

ఒకపక్క ఇటలీలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో, టోర్నమెంట్ జరిగిన 9 నెలల పాటు లియోన్ లూక్ మెన్డోంకా, అతని తండ్రి అద్దె వసతి గృహాలలోనే నివసించారు.అక్కడే తన కోచ్ జిఎం విష్ణు ప్రసన్న ద్వారా లియోన్ లూక్ మెన్డోంకా శిక్షణ తీసుకున్నాడు.

Advertisement

తన కుమారుడు గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించడంపై అతని తండ్రి లియోన్ మాట్లాడుతూ ‘‘టోర్నమెంట్ జరుగుతున్న 9 నెలల సుదీర్ఘ కాలం పాటు లియోన్ తన తల్లి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చింది.కానీ, ఎటువంటి ఆందోళన, బెరుకు చెందకుండా ఆటపై శ్రద్ధ పెట్టి పట్టుదలతో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు.

నా కుమారుడికి కోచ్ గా ఉన్నా జిఎం విష్ణు ప్రసన్న ఇచ్చిన ట్రైనింగ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ దక్కించుకోవడంలో ఎంతగానో తోడ్పడింది.ఆయన ట్రైనింగ్ వల్ల ఇంత త్వరగా నా కుమారుడు గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు.

" అని తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు.

దీనిపై లియోన్ లూక్ మెన్డోంకా మాట్లాడుతూ.“ నేను గ్రాండ్ మాస్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది.ఈ టైటిల్ సాధించడానికి నేను పగలు రాత్రి ఎంతో కష్టపడ్డా.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

నేను ఈ విజయాన్ని సాధించడానికి నా వెన్నంటి ఉండి, నాకు సపోర్ట్ గా ఉన్న నా తల్లిదండ్రులకు, కోచ్ విష్ణు ప్రసన్నకు ,అలాగే నా స్పాన్సర్స్ తో సహా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా " అని తెలిపాడు.అలాగే జులై లో జరిగిన ప్రపంచ చెస్ పోటీల్లో చెన్నై ఆటగాడు జి ఆకాష్ పోటీలో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలో నెగ్గి భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ దక్కించుకున్న 66వ వ్యక్తిగా నిలిచాడు.

Advertisement

ఇప్పుడు లియోన్ లూక్ మెన్డోంకా 67 వ్యక్తిగా నిలవడం విశేషం.

తాజా వార్తలు