మన పంద్రాగస్టు కు అమెరికాలో గుర్తింపు...కీలక ప్రకటన చేసిన డాలస్ మేయర్..!!!

అగ్ర రాజ్యం అమెరికాలో మన స్వాతంత్ర్య దినోత్సవానికి అరుదైన గుర్తింపు లభించింది.ప్రతీ ఒక్క భారతీయుడు గర్వపడేలా మన పంద్రాగస్టు ను ఇండియన్ అమెరికన్ డే గా అమెరికాలో డాలస్ ప్రభుత్వం ప్రకటించింది.

 Recognition Of Our 15th In America Dallas Mayor Made A Key Announcement , America , Dallas Mayor , Indians, Johnson, Indo American Day, Mayor Of Dallas, Independence Day Festival-TeluguStop.com

ఈ ప్రకటనతో అమెరికా వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ సంతోషం వ్యక్తం చేసారు.భారత జాతి మొత్తం కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతి పెద్ద పండుగ స్వాతంత్ర్య దినోత్సవ పండుగ.

ఈ రోజున ప్రతీ ఒక్కరూ భారత జాతికి స్వాతంత్ర్య తీసుకువచ్చిన త్యగాధనులను గుర్తు చేసుకుంటారు.భావి తరాలలో స్పూర్తిని నింపుతుంటారు.

 Recognition Of Our 15th In America Dallas Mayor Made A Key Announcement , America , Dallas Mayor , Indians, Johnson, Indo American Day, Mayor Of Dallas, Independence Day Festival-మన పంద్రాగస్టు కు అమెరికాలో గుర్తింపు#8230;కీలక ప్రకటన చేసిన డాలస్ మేయర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారత దేశం నుంచీ విదేశాలకు వెళ్ళిన వారు సైతం ఆయా దేశాలలో పంద్రాగస్ట్ వేడుకలు నిరహించుకుంటారు.ఈ క్రమంలోనే అగ్ర రాజ్యం అమెరికాలో అత్యధిక శాతం మంది ఉండే భారతీయ ప్రవాసులు ఎప్పటిలానే అన్ని రాష్ట్రాలలో పంద్రాగస్ట్ వేడుకలు నిర్వహించుకోవడమే పలు కార్యక్రమాలను నిర్వహించారు ఎన్నారైలు.

ఈ క్రమంలోనే డాలస్ లోని ఎన్నారైలు తాము ఎంతో వేడుకగా జరుపుకునే ఈ రోజుకు గుర్తింపును ఇవ్వాలంటూ డాలస్ నగర మేయర్ కు విజ్ఞప్తులు ఇవ్వడంతో డాలస్ మేయర్ జాన్సన్ కీలక ప్రకటన చేసారు.

భారత సంతతి ఎన్నారైలతో సమావేశం ఏర్పాటు చేసిన జాన్సన్ భారతీయులు అందరూ గర్వించేలా పంద్రాగస్ట్ ను ఇండో అమెరికన్ డే గా ప్రకటించారు.

ఇకపై ప్రతీ ఏటా పంద్రాగస్టు ఇండో అమెరికన్ డే గా జరుపుకోమంటూ ప్రకటించారు.భారతీయుల విజ్ఞప్తిని జాన్సన్ గౌరవించడానికి కారణం లేకపోలేదు.

డాలస్, ఫోర్ట్వర్త్ నగరాలలో కలిసి సుమారు 2 లక్షల మందికి పైనే భారతీయులు ఉంటున్నారు.వీరిలో ఎంతో మంది ఉతర టెక్సాస్ అభివృద్ధి లో కీలక భాగస్వాములుగా ఉన్నారు.

వీరందరిని సంతృప్తి పరిచేందుకు, అలాగే వారు తమ దేశాభివృద్ది కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా పంద్రాగస్ట్ ను ఇండో అమెరికన్ డే గ గుర్తించినట్టుగా తెలుస్తోంది.మేయర్ జాన్సన్ ఈ ప్రకటన చేయడమే కాదు, అందుకు సంభందించిన ధృవీకరణ పత్రాన్ని కూడా భారత ఎన్నారైలకు అందించారు.

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube