సల్మాన్ రష్డీపై హత్యాయత్నం... భారత్ మౌనం వెనుక ..?

ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై ఆగంతకుడి దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఏళ్ల నుంచి ఆయనకు ముస్లిం సమాజం నుంచి ప్రాణాపాయం వున్న నేపథ్యంలో ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయారు.

 Why Is India Silent Over Attack On Author Salman Rushdie ? , Salman Rushdie, In-TeluguStop.com

వేదికపై ప్రసంగిస్తుండగా అదను చూసి దుండగుడు కత్తితో పలుమార్లు పొడవటంతో రష్డీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.ఆసుపత్రిలో గంటల పాటు శ్రమించిన వైద్య బృందం ఆయనను రక్షించగలిగింది.

ఆరోగ్యం అత్యంత విషమించడంతో సల్మాన్‌ను వెంటిలేటర్‌పై వుంచి చికిత్స అందించారు.ఈ దాడిని పలువురు దేశాధినేతలు, ప్రముఖులు ఖండించారు.

కానీ ఆశ్చర్యకరంగా భారత ప్రభుత్వం కానీ, భారత నాయకులు కానీ ఇఫ్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.నిజానికి సల్మాన్ రష్డీ భారత సంతతికి చెందినవారు.

ఆయన బొంబాయిలోనే పుట్టి పెరిగారు.కనీసం అతని భారతీయ వారసత్వాన్ని పరిగణనలోనికి తీసుకుని భారత ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం అందిస్తే బాగుండేదనే విమర్శలు వస్తున్నాయి.

కానీ ఈ వ్యూహాత్మక మౌనం ద్వారా భారత ప్రభుత్వం సల్మాన్ రష్డీపై జరిగిన భయంకరమైన దాడిని హర్షిస్తున్న ఇస్లామిక్ ఛాందసవాదులకు మద్ధతు పలికేలా వుందనే ఆరోపణలు వస్తున్నాయి.మరి ఈ విమర్శల నేపథ్యంలో భారత్ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో వేచి చూడాలి.

Telugu America, Attack, Bombay, India, Iran, Modi, York, Salman Rushdie, Satanic

సల్మాన్ రష్డీ 1988లో రచించిన ‘‘ ది సాటానిక్ వెర్సెస్’’ కోట్లాది మంది ముస్లింలను , ఇస్లాంను, మొహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వుందని ఆయనపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.కానీ ఈ విషయాన్ని ఇరాన్ మాత్రం సీరియస్‌గా పరిగణించింది.నాటి ఆ దేశ అధినాయకుడు అయతోల్లా రుహోల్లా ఖొమేనీ .సల్మాన్ ‌ను హతమార్చాల్సిందిగా ఫత్వా జారీ చేశారు.దీంతో సల్మాన్ రష్డీ కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దశాబ్ధాలు గడవటంతో, సల్మాన్ ప్రాణాలకు ముప్పు ముగిసిపోయిందని.ఫత్వా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని భావిస్తోన్న తరుణంలో రష్డీపై జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube