నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికి.టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే.
ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నటించింది.అంతే కాదు తెలుగులో నజ్రియాకు ఇది మొదటి సినిమా కావడం గమనార్హం.
కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా యొక్క స్టోరీలైన్ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ లో ప్రేక్షకులకు ఒక అవగాహన వచ్చింది.
టీజర్ ట్రైలర్ లో చూపించిన విధంగానే సింపుల్ స్టోరీతోనే కానీ సినిమాలు మొత్తం నడిపించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ.ఈ క్రమంలోనే అంటే సుందరానికి మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సినిమాలోని పాత్రలను పరిచయం చేయడానికి సరిపోతూ ఉంటుంది.
సెకండాఫ్లో అసలు కథ మొదలవుతుంది.ఈ సినిమాలో ఎప్పటిలాగానే నాని నటన ఎంతో నాచురల్ గా కనిపిస్తుంది అని చెప్పాలి.
ఇక నజ్రియా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే.

కథ బలంగా లేకపోయినా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి అంటే సుందరానికి సినిమా బాగా నచ్చుతుంది అని చెప్పాలి.కానీ కథ కథనం బలంగా ఉండాలి అని సినిమాకు వెళితే మాత్రం నిరాశ తప్పదు అని తెలుస్తుంది.ఈ క్రమంలోనే అంటే సుందరానికి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న… కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది.
సింపుల్ స్టోరీ రాసుకున్న వివేక్ ఆత్రేయ సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడం లో మాత్రం తడబడ్డాడు అంటూ కొంతమంది అంటున్నారట.ఇక కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా కాకుండా అనవసరంగా ఇరికించినట్లుగా బోర్ కొట్టేలా ఉన్నాయట.
అంతేకాకుండా సినిమా నిడివిని కొంతమేర తగ్గిస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేదని కొంతమంది ప్రేక్షకుల భావిస్తున్నారట.కానీ ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ముందు ఇవేవీ ప్రేక్షకుల పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.







