ఇటీవల కాలంలో సెలెబ్రిటీలపై కేసులు పెట్టడం అనేది తరచు వింటూనే ఉన్నాం.సెలెబ్రిటీలు యాడ్స్ లో నటించడం అనేది ఎప్పటి నుండో జరుగుతుంది.
ఇలా సెలెబ్రిటీలతో చేయిస్తే వారి బ్రాండ్ లకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది అని భావించి వీరితో ఇలా యాడ్స్ ను చేయిస్తారు.అయితే ఈ యాడ్స్ ఒక్కోసారి సెలెబ్రెటీలకు తలనొప్పిగా మారుతున్నాయి.
వారు చేసే యాడ్స్ కొంత వరకే సక్సెస్ అవుతున్నాయి.ఈ మధ్య కాలంలో ఇలా యాడ్స్ వల్ల చిక్కులు ఎదుర్కున్న సెలేబ్రిటీలు చాలా మంది ఉన్నారు.
మరి ఈ కోవకే చెందుతారు అల్లు అర్జున్.ఈయనకు సినిమాల పరంగా బాగా కలిసి వస్తున్నా యాడ్స్ మాత్రం కలిసి రావడం లేదు.
ఈయన చేసే యాడ్స్ వల్ల ఈయనకు చిక్కులు తప్పడం లేదు.
ఈయన రెడ్ బస్, జొమాటో, ఫ్రూటీ, ర్యాఫిడో వంటి బ్రాండ్స్ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.
అలాగే ఒక ప్రముఖ విద్య సంస్థకు కూడా యాడ్ లో నటించారు.ఈ యాడ్ వల్ల ఇప్పుడు ఈయనకు చిక్కులు వచ్చాయి.
ఇందులో ఐఐటీ, నీట్ ర్యాంక్ లను తప్పుగా చూపించారు అంటూ ఒక వ్యక్తి అల్లు అర్జున్ పై పోలీస్ కేసు పెట్టారు.ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఉపేందర్ రెడ్డి అనే వ్యక్తి అంబర్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేసాడు.ఇలా యాడ్ అల్లు అర్జున్ కు చిక్కులు తెచ్చింది.

ఇది పక్కన పెడితే ఈయన నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.







