నాగచైతన్యపై సామ్ కోపానికి అసలు కారణమిదే.. అన్యాయం చేశాడంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్యోన్యంగా ఉన్న జోడీలలో చైతన్య సమంత జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.చైతన్య సమంత కలిసి ఉన్న సమయంలో ఒకరి గురించి మరొకరు తప్పుగా చెప్పుకున్న సందర్భాలు ఒక్కటి కూడా లేవు.

 Reasons Behind Samantha Angry On Nagachaitanya Details Here , Samantha Angry , Nagachaitanya , Reasons Behind Samantha Angry , Tollywood , Chaitanya Samantha Jodi-TeluguStop.com

అదే సమయంలో విడిపోయిన తర్వాత చైతన్య సమంత గురించి తప్పుగా కామెంట్లు చేయకపోయినా సమంత మాత్రం చైతన్యను పరోక్షంగా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ విమర్శలు చేసిన వాళ్లకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు.

అయితే నాగచైతన్య చేసిన ఒక పని సమంత ఆగ్రహానికి కారణమని సమాచారం అందుతోంది.సమంత చైతన్య పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు ప్రకటన చేశారు.అయితే చైసామ్ విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో సమంత గురించి తప్పుగా ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే నాగచైతన్య నుంచి సమంతపై వైరల్ అవుతున్న పుకార్లకు సంబంధించి ఎలాంటి ఖండన వెలువడలేదు.

 Reasons Behind Samantha Angry On Nagachaitanya Details Here , Samantha Angry , Nagachaitanya , Reasons Behind Samantha Angry , Tollywood , Chaitanya Samantha Jodi-నాగచైతన్యపై సామ్ కోపానికి అసలు కారణమిదే.. అన్యాయం చేశాడంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగచైతన్య స్పందించకపోవడం సమంతకు ఆగ్రహం కలిగించిందని తెలుస్తోంది.ఈ విధంగా చేసి చైతన్య ఒక విధంగా తనకు అన్యాయం చేశాడనే భావనలో సామ్ ఉన్నారని బోగట్టా.చైసామ్ కాంబినేషన్ లో సినిమా రావడం దాదాపుగా అసాధ్యమని తెలుస్తోంది.చైసామ్ విడిపోయినా వివాదాల ద్వారా వార్తల్లో నిలవకుండా ఉంటే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Nagachaitanya, Samantha Angry, Samantha, Tollywood-Movie

సమంత ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు.సమంత నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే ఆమె కెరీర్ ఊపందుకుంటుందని చెప్పవచ్చు.సమంత ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సమంత పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా కూడా సమంత భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube