కార్తీకదీపంను అందుకే సాగదీస్తున్నాం.. అసలు విషయం చెప్పిన డాక్టర్ బాబు

సాధారణంగా బుల్లితెర సీరియల్స్ ను సాగదీస్తారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియళ్లలో కొన్ని సీరియళ్లు ఏకంగా 1,000కు పైగా ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి.

1,000 ఎపిసోడ్స్ దాటినా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ప్రసారమవుతున్న టీవీ సీరియల్ గా కార్తీకదీపం సీరియల్ ఒకటి.సీరియళ్లను అస్సలు ఇష్టపడని వాళ్లు సైతం కార్తీకదీపం సీరియల్ ను ఇష్టపడటం గమనార్హం.

అయితే కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఈ సీరియల్ ను సాగదీస్తున్నారని త్వరలోనే ఈ సీరియల్ కు శుభం కార్డు వేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.అయితే మిగతా సీరియల్స్ తో పోలిస్తే రెట్టింపు రేటింగ్ ను సొంతం చేసుకుంటూ టాప్ లో ఉన్న ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్కలకు ఎక్కువ సంఖ్యలో అభిమనులు ఉన్నారు.

డాక్టర్ బాబు వంటలక్క కలిపేస్తే బాగుంటుందని ఈ సీరియల్ డైరెక్టర్ ను తిట్టేవాళ్లు చాలామంది ఉన్నారు.

Advertisement

ఈ సీరియల్ పై ప్రేక్షకుల నుంచి ప్రధానంగా వ్యక్తమవుతున్న ఈ కంప్లైంట్ గురించి స్పందించి నిరుపమ్ వివరణ ఇచ్చారు.కార్తీకదీపం సీరియల్ స్టోరీని దర్శకుడు రాజేంద్ర సెనిటివ్ గా ట్రీట్ చేస్తున్నారని నిరుపమ్ తెలిపారు.ఈ సీరియల్ కు దర్శకునిగా రాజేంద్రను కాకుండా మరొకరిని ఊహించడం కష్టమని నిరుపమ్ చెప్పుకొచ్చారు.

కార్తీకదీపం సీరియల్ ను సాగదీసి పిచ్చిపిచ్చిగా తీయడం లేదని నిరుపమ్ తెలిపారు.

కథపై నమ్మకం ఉండటంతో పాటు పాయింట్ స్ట్రాంగ్ గా వెళుతుందని అనిపిస్తే మాత్రమే కార్తీకదీపం సీరియల్ ను ప్రొలాంగ్ చేయడం జరుగుతుందని నిరుపమ్ అన్నారు.రాబోయే రోజుల్లో ఈ సీరియల్ లో మరిన్ని ట్విస్టులు ఉంటాయని నిరుపమ్ అన్నారు.ఒకే పాయింట్ పై సీరియల్ ను సాగదీయడం అయితే జరగదని నిరుపమ్ వెల్లడించారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు