తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది రైటర్లు( Writers ) వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది రైటర్లు డైరెక్టర్లుగా మారి మంచి విజయాన్ని అందుకుంటుంటే మరి కొంతమంది రైటర్లు మాత్రం డైరెక్టర్లుగా మారిన కూడా సక్సెస్ కాలేకపోతున్నారు.
ఇక అందులో ముఖ్యంగా ఒక ముగ్గురు రైటర్లు మాత్రం దర్శకులుగా మారి పలు రకాల సినిమాలు చేసినా కూడా వాళ్ళు సక్సెస్ ఫుల్ దర్శకులుగా మారలేకపోతున్నారు.అందులో ముఖ్యంగా వక్కంతం వంశీ గురించి చెప్పుకోవాలి.
వక్కంతం వంశీ( Vakkantham Vamsi )
ఈయన మొదట అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” అనే సినిమా చేశాడు.ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవలేదు.ఇక దాంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని నితిన్ తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్( Extra Ordinary Man ) అనే సినిమా చేశాడు.ఇక ఈ సినిమా డిజాస్టర్ గా మారడంతో రైటర్ గా సక్సెస్ అయినంత ఈజీగా ఈయన దర్శకుడి గా సక్సెస్ కాలేకపోయాడు.ఇక ఆయన ఫ్యూచర్ లో దర్శకుడుగా సక్సెస్ అవుతాడా లేదా అనే విషయం పక్కనపెడితే ఇప్పటికి మాత్రం ఆయన దర్శకుడిగా సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి…
బివిఎస్ రవి( BVS Ravi )
ఈయన కూడా సత్యం( Satyam ), కింగ్, నమో వెంకటేశ లాంటి కొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని అందరు అనుకున్నారు.కానీ ఆయన అందరికీ షాకిస్తూ ఆయన దర్శకుడిగా మారి చేసిన వాంటెడ్ సినిమా డిజాస్టర్ అయింది.ఇక ఆ తరవాత సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పెట్టి చేసిన జవాన్ సినిమా( Jawan Movie ) కూడా ఆశించిన విజయాన్ని అందించలేదనే చెప్పాలి…
వెలుగొండ శ్రీనివాస్( Veligonda Srinivas )
అఖిల్ విన్నర్ లాంటి సినిమాలకు కథలు అందించిన వెలుగొండ శ్రీనివాస్ కూడా రాజ్ తరంతో అందగాడు అనే సినిమా చేశాడు అయితే ఈ సినిమా తను సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మారతారని అనుకున్నప్పటికీ ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మారలేకపోయాడు…