నందితా శ్వేత టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ఢీ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న నందిత శ్వేత ఈ వారానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా వేదికపై ఎమోషనల్ అయినట్టు చూపించారు.
అయితే ఈమె గిఫ్ట్ బాక్స్ చూసి ఎందుకు ఏడ్చారు అనే సందేహం అందరిలోనూ నెలకొంది.అయితే ఆమె ఏడవడానికి గల కారణం ఏమిటో పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావడంతో అసలు విషయం బయటపడింది.
హీరోయిన్ నందిత శ్వేత పుట్టినరోజు ఏప్రిల్ 30 తేదీ కావడంతో నిర్వాహకులు ఆమెకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ తనని వేదికపై పిలిచి తనకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు.
ఇక వేదికపైనే ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి నందిత శ్వేత ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.దీంతో ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముందనే ఆతృత ప్రతి ఒక్కరిలోనూ నెలకొనివుంది.
అయితే ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముందనే విషయానికి వస్తే.

నందిత శ్వేత గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఓ కుక్కపిల్ల బొమ్మ ఉండటం చూసి ఆమె ఎమోషనల్ అయ్యారు.కుక్క పిల్ల బొమ్మను చూసి ఎమోషనల్ కావాల్సిన అవసరం ఏముంది అనే విషయానికి వస్తే ఆ బొమ్మ నందిత శ్వేతకు ఎంతో ఇష్టమైన ఖుషి అనే కుక్క పిల్ల బొమ్మ.అయితే ఖుషి చనిపోవడంతో అచ్చం అలాంటి రూపంలో ఉన్నటువంటి బొమ్మను బహుమతిగా ఇవ్వడంతో ఒక్క సారిగా తన ఖుషిని తలుచుకొని నందిత ఎమోషనల్ అయ్యారు.