జనసేన వైసీపీల మధ్య నెలకొన్న వివాదం రాజకీయ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే అయినా జగన్ ఒక అడుగు ముందుకు వేసి మరీ జనసేన అధ్యక్షుడు పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయ కాకా పుట్టించాడు.అయితే ఇదంతా జగన్ చేసిన రాజకీయ తప్పిదమని అందరూ జగన్ తీరుని తప్పు పట్టినా … ఆయన మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలేదు.
ఇదంతా జగన్ వ్యూహాత్మకంగా వేసిన రాజకీయ అడుగులేనని ఇప్పుడు అందరికి అర్ధం అవుతోంది.అయితే ఈ వ్యవహారానికి ముందు జనసేన – వైసీపీ ముందు అంతర్గతంగా కొన్ని రకాల చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో వైసాఈపీతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన సిద్ధమని అందుకు ప్రతిఫలంగా కొన్ని సీట్లు ఇవ్వాలని జనసేన వైపు నుంచి ప్రతిపాదన వచ్చినట్టుగా సమాచారం.మొత్తం 29 ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలంటూ పవన్ జగన్ కి కబురు పంపించాడట.కానీ ఆ ప్రతిపాదనకు జగన్ ఒప్పుకోకపోవడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయినట్టు తెలుస్తోంది.ఒంటరిగా వెళ్తే జనసేనకు నాలుగు అయిదు సీట్లకు మించి వచ్చే అవకాశమే లేదని , కావాలంటే పది లోపు సీట్లు ఇచ్చేందుకు జగన్ ఒప్పుకున్నాడట.
కానీ అది జనసేన అధినేతకు నచ్చలేదని అందుకే పొత్తు ప్రతిపాదనను రెండు పార్టీలు పక్కన పెట్టేశాయి.
ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఒంటరి పోరుకు మానసికంగా సిద్ధం అయిపోయారు.
ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు కూడా తెలియబరచాలని జగన్ కొన్నాళ్లు ప్రయత్నిస్తున్నారు.అందులో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా అదే మాటే చెప్పాడు జగన్ మోహన్ రెడ్డి.
అయితే ఇది మరింత ఘాటుగా పార్టీ శ్రేణులకు తెలియజేయడానికే జగన్ మోహన్ రెడ్డి పవన్ విషయంలో వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.







