హీరోలు కాస్టింగ్‌ కౌచ్‌.. వారిని దోచుకుంటున్నారు!

హాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ వరకు అన్ని సినీ పరిశ్రల్లో కూడా హీరోయిన్స్‌, లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కాస్టింగ్‌ కౌచ్‌కు బలి అవుతున్న విషయం తెల్సిందే.తెలుగు సినీ పరిశ్రమకు చెందిన శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందో తెలుస్తోంది.

 Rx 100 Hero Karthikeya Comments On Film Industry-TeluguStop.com

హీరోయిన్స్‌గా అవకాశాలు దక్కించుకోవాలి అంటే ఖచ్చితంగా అమ్మాయిలు తమను అర్పించాల్సిన పరిస్థితి ఉంది.ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్స్‌ కాస్టింగ్‌ కౌచ్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోయిన్స్‌ ఎంతో మంది కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవంను ఎదుర్కొన్న వారే అనడంలో ఎలాంటి సందేహం లేదు.అన్ని భాషల సినీ ప్రముఖులు కూడా హీరోయిన్స్‌ను వేదించేవారే అంటూ పలువురు అంటూ ఉన్నారు.

ఇక ఇదే సమయంలో హీరోల కాస్టింగ్‌ కౌచ్‌ గురించి కొందరు ఆరోపణలు చేస్తున్నారు.కొత్తగా హీరో అవ్వాలనుకునే వారి బలహీనతలను క్యాష్‌ చేసుకునేందుకు కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తారు అంటూ చాలా కాలం నుండి ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో చర్చ జరుగుతున్న విషయంలోనే హీరోలు మోస పోయిన విధానం కూడా బయటకు వస్తుంది.

తెలుగులో హీరోలుగా ఎంట్రీ ఇవ్వాaనుకునే కుర్రాళ్లు నిర్మాతలకు అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే.ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యిందట.గతంలో పలు సార్లు పలువురు నిర్మాతలు తనను మోసం చేశారు అని, హీరోగా పరిచయం చేస్తామని, కొంత డబ్బు కావాలంటే అడగడంతో తాను లక్షలకు లక్షలు ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు.

ఆడవారిని వాడుకునే సినిమా ఇండస్ట్రీ వారు హీరోలు కావాలనుకునే వారి నుండి ఆర్థికంగా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు.తనలా ఎంతో మంది యువకులు మోస పోతున్నారు అని, డబ్బులు అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా వారు మోసం చేసేందుకే అనే విషయం తెలుసుకోవాలి అంటూ కార్తికేయ అంటున్నాడు.

హీరో అవ్వాలని అనుకునే వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.లేదంటే కార్తికేయలా మోసపోయే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube