మహేష్ పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడా?

మహేష్ బాబు మొన్న తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెంకు వెళ్ళాడు.అక్కడి ప్రజల మీద వరాలు కురిపించాడు.

 Burripalem Visit – A Publicity Stunt By Mahesh Babu?-TeluguStop.com

కోట్లు ఖర్చుపెట్టాడు.బాగానే ఉంది.కాని ఇప్పుడే మహేష్ బాబుకి ఇదంతా ఎందుకు గుర్తొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

“శ్రీమంతుడు ఆడుతున్న చివరి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపూర్ గ్రామాల్ని దత్తత తీసుకున్నాడు మహేష్ బాబు.శ్రీమంతుడు విడుదల సమయంలో ప్రకటించి ఉంటే పబ్లిసిటి అనుకునేవారని చెప్పాడు.బాగుంది.ఇదంతా జరిగి చాలా నెలలు గడచిపోయాయి.మరిన్నీ రోజులు మహేష్ కి దత్తత తీసుకున్న గ్రామాలు ఎందుకు గుర్తుకు రాలేదు.

సరిగ్గా బ్రహ్మోత్సవం విడుదలకు సిద్ధమవుతుండగా ఈ వరాల జల్లు ఏమిటి .ఇదంతా పబ్లిసిటి కోసమే చేస్తున్నాడా “అంటూ అడుగుతున్నారు పవర్ స్టార్ అభిమానులు.

పవన్ ఏం చేశాడు? ప్రజాసేవ వలన కలెక్షన్లు ఎక్కువ వస్తాయా? ప్రజలకు కావాల్సింది ప్రశ్నించేవాళ్ళు కాదు, పని చేసేవాళ్ళని తిరిగి ప్రశ్నిస్తున్నారు మహేష్ అభిమానులు.అయినా, ఈ అభిమానుల గొడవలు మనకెందుకు.

ఇద్దరూ ప్రజలకు మంచి చేస్తామన్నారు.చెప్పిందంతా చేస్తే చాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube