పాపం హెబ్బా పటేల్ !

తొలిసినిమా “అలా ఎలా” తోనే సూపర్ హిట్ అందుకున్నా, హెబా పటేల్ అంటే ఎవరో జనాలకి తెలిసింది మాత్రం “కుమారి 21F” తోనే.బాక్సాఫీస్ వద్ద భారి సక్సెస్ అందుకున్న ఆ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యి కూర్చుంది హెబా.

 Hebah Patel Out Of Varun Tej’s Mister?-TeluguStop.com

ఇక ఈ కుమారి దశ తిరిగిపోయినట్లే అని అనుకున్నారంతా.కాని అలాంటిదేమి జరగలేదు.

రెండు చిన్న సినిమాలు, శ్రీనువైట్ల – వరుణ్ తేజ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం దొరికింది.అయితే హెబా చేతిలో ఉన్న ఒక్క పెద్ద అవకాశం కూడా ఊడిపోయిందట.

వరుణ్ తేజ్ “మిస్టర్” లోంచి హెబాను తీసేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

హెబా స్థానంలో మెగా హీరోల ఆస్థాన కథానాయిక రెజీనాని తీసుకున్నారని వినికిడి.

అయితే దీనిపై ఇంకా ఎలాంటి అఫిషియల్ న్యూస్ లేదు.

నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం యొక్క రెగ్యూలర్ షూటింగ్ ఈ నెల మూడొవవారంలో మొదలవనుంది.

చాలా రోజుల తరువాత రచయిత గోపిమోహన్ శ్రీనువైట్లతో కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube