పసికూన నెదర్లాండ్స్ చేతిలో బంగ్లా ఓటమికి ప్రధాన కారణం అదే..!

ప్రపంచ కప్ టోర్నీలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన పసికూన నెదర్లాండ్స్ (Netherlands)జట్టు టోర్నీలో ఉండే మిగతా జట్లకు ఊహించని షాక్ లు ఇస్తోంది.

దక్షిణాఫ్రికా (South Africa)జట్టుకు ఊహించని ఓటమి ఇచ్చిన నెదర్లాండ్స్ జట్టు తాజాగా బంగ్లాదేశ్ జట్టును కూడా చిత్తుగా ఓడించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్ జట్టును ఏకంగా 87 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్ ఓడించింది.ఈడెన్ గార్డెన్స్(Eden Garden) వేదికగా జరిగిన బంగ్లాదేశ్- నెదర్లాండ్స్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్ బ్యాటర్లైన స్కాట్ ఎడ్వర్డ్ 68,(Scott Edward) వెస్లీ బారెసి 41,(Wesley Baresi) సైబ్రాండ్ 35 పరుగులు చేశారు.స్వల్ప లక్ష్య చేదనకు దిగిన బంగ్లా జట్టు త్వరగా మ్యాచ్ పూర్తి చేస్తుంది అనుకుంటే.బంగ్లాదేశ్ (Bangladesh)42.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులకే కుప్పకూలింది.మెహిదీ హసన్ మిరాజ్(Mehdi Hasan Miraj) 35 పరుగులు చేయగా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు చాలా ఘోరంగా విఫలమయ్యారు.

బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan) ఓటమిపై స్పందిస్తూ.బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని తెలిపాడు.తమ జట్టు బౌలింగ్ బాగానే చేసిందని, నెదర్లాండ్స్ జట్టు ను 170 పరుగులకే కట్టడి చేసి ఉంటే బాగుండేదని తెలిపాడు.

Advertisement

అసలు ఇది బంగ్లా జట్టేనా అనేలా మా ఆట తీరు ఉంది.తర్వాత మ్యాచ్ లలో కూడా తమ జట్టుకు అన్ని కఠిన సవాళ్లే ఎదురవుతాయి.తర్వాత మ్యాచ్ లలో ధైర్యంగా తమ జట్టు ముందుకు సాగుతుందని చెప్పాడు.

ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు.ఈ టోర్నమెంట్ మొత్తంలో ఇప్పటివరకు బ్యాటింగ్ పరంగా తమ బంగ్లాదేశ్ జట్టు పూర్తిగా విఫలం అయిందని కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు.బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు మ్యాచ్లలో ఓడింది.

ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.కనీసం అందులో రెండు మ్యాచ్ లు నైనా గెలిచి తమ పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపాడు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు