టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
కాగా బాలయ్య బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్ టైనర్ సినిమాకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వడంతో సినిమా షూటింగ్ నవంబర్ లో మొదలుపెట్టాలి అని చిత్ర బృందం అనుకున్నారు.
అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ సినిమాకు సంబంధించిన టీం ని కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి మరికొద్ది రోజులు సమయం పట్టేలా కనిపిస్తోంది.
అందుకు గల కారణం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న సినిమా షెడ్యూల్ ఇంకా పూర్తి కాకపోవడమే అని తెలుస్తోంది.దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ ను జనవరిలో మొదలు పెట్టాలి అని చూస్తున్నారట.

సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కావచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.మరొకవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది.బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కారణంగా ఈ సినిమా షూటింగ్ కి కూడా తరచుగా హాజరు కాలేకపోతున్నారు.ఇక ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి సినిమా స్టోరీ విషయానికి వస్తే.
తండ్రి కూతుర్ల ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఇందులో బాలకృష్ణ కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల ను ఎంపిక చేశారు.
ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మను తీసుకోవడంతో పాటు విలన్ క్యారెకర్ లో కూడా బాలీవుడ్ నటుడిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.







