తెలుగు బిగ్ బాస్ 6 లో ఇనాయ ప్రవర్తన చాలా మంది కి వింతగా అనిపిస్తుంది.ఆమె మొదట వ్యవహరించిన తీరు కి మొదటి రెండు మూడు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు.
కానీ ఆమె ప్రవర్తన లో మెల్ల మెల్లగా మార్పు వచ్చింది.ఆమె ఇన్ని వారాలు కొనసాగడానికి కారణం ఆమె ప్రవర్తన మరియు ఆట తీరు అని అంతా భావిస్తున్నారు.
కానీ తాజాగా ఆర్ జె సూర్య ను నామినేట్ చేసి, వెళ్లి పోయేలా చేసింది.మళ్ళీ ఆమె సూర్య వెళ్ళి పోయినందుకు కన్నీళ్లు పెట్టుకుంది.
మహా నటి అంటూ ఆమె ను చాలా మంది విమర్శించారు.ఇక ఈ వారం అంతా కూడా సూర్య పేరు జపిస్తూ ఆమె తెగ ఓవరాక్షన్ చేస్తుంది.
సూర్య సూర్య అంటూ అతడు తిన్న ప్లేట్లో తినడం.అతడు ఉన్న ప్లేస్ లో ఉండడం.అతడి తో గడిపిన క్షణాలను పదే పదే గుర్తు చేసుకుంటున్నాట్లుగా హౌస్ మెన్స్ తో మాట్లాడటం మరీ ఓవరాక్షన్ గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.అంతే కాకుండా శ్రీహాన్ మరియు శ్రీ సత్య లు ఓకే బెడ్ పై పడుకుంటున్నారంటూ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర దూమారాన్ని రేపింది.
మొత్తానికి ఈ అమ్మాయి చేస్తున్న ఓవరాక్షన్ తో ప్రేక్షకులు చిరాకు పడుతూ ఉంటే.

వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చే నాగార్జున కచ్చితం గా సీరియస్ అయ్యే అవకాశం ఉంది అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.రాంగోపాల్ వర్మ సహకారం తో ఎన్ని వారాల పాటు ఈమె హౌస్ లో కొనసాగుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె ఆట తీరు నిజం గా బాగుందని.కానీ ఈ వారం ఆమె ఆట గాడి తప్పినట్లుగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఆమె వెంటనే తన పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అంటూ కొందరు సూచిస్తున్నారు.







