టీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.టీఆర్ఎస్ లో వెట్టి చాకిరి తప్ప భవిష్యత్ ఉండదని చెప్పారు.
మూడు తరాల వరకు ఇతరులు ఆ పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశం లేదన్నారు.కేసీఆర్ కుటుంబ పాలనకే బీజేపీలో సామాన్య కార్యకర్తలు సైతం ఉన్నత పదవులు చేపట్టారని తెలిపారు.
ఈ క్రమంలో ప్రజలు కూడా బీజేపీకే పట్టం కట్టాలనే యోచనలో ఉన్నారని చెప్పారు.అదేవిధంగా మునుగోడులో కూడా బీజేపీనే గెలుపు సాధిస్తుందని బూర ధీమా వ్యక్తం చేశారు.







