టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నటించిన యశోద సినిమాపై ఇండస్ట్రీ చాలా ఆశలు పెట్టుకుంది.ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించడంతో పాటు సామ్ మార్కెట్ ను పెంచుతుందని చాలామంది భావిస్తున్నారు.
ఆరోగ్య సమస్యల వల్ల సమంత ప్రస్తుతం సినిమాలను ప్రమోట్ చేసే అవకాశం కూడా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.మరో వారం రోజుల్లో యశోద మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం గమనార్హం.135 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో స్థాయిలో లాభాలను అందించిందని బోగట్టా.ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.
ప్రముఖ నిర్మాతలలో ఒకరైన శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన యశోద మూవీ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెబుతున్నారు.థ్రిల్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
యశోద సినిమా సమంత కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సమంత తర్వాత సినిమాలకు కూడా భారీగా బిజినెస్ జరుగుతుంది.
సమంత నటించిన శాకుంతలం సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.ఈ సినిమాకు బడ్జెట్ కు అనుగుణంగా బిజినెస్ జరుగుతుందో లేదో చూడాలి.గుణశేఖర్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. సమంత కెరీర్ ఈ రెండు సినిమాలపైనే ఆధారపడి ఉందని తెలుస్తోంది.







