టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుల పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతోన్న యుద్ధంలో తాము బలి అవుతున్నామని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు.
పోలీసులు పక్షపాతంతో దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.మేజిస్ట్రేట్ రిమాండ్ కు తిరస్కరించారని వెల్లడించారు.
కానీ రెండు రోజుల్లోనే హైకోర్టు తీర్పు మారిందని కోర్టుకు తెలిపారు.ఈ క్రమంలో హైకోర్టు ఇలాంటి భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
బెయిల్ పిటిషన్ వేసి ఉంటే విడుదల చేసే వాళ్లమని జస్టిస్ గవాయి తెలిపారు.ఈ కేసులో మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సూచించింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.







