సంచలనంగా మారిన అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది.ఈ క్రమంలో అదానీ సంస్థలకు ఇచ్చిన రుణాలపై వివరాలు ఇవ్వాలని పలు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
అదానీ గ్రూపులలో బ్యాంకులకు 37 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే.ద్రవ్యసంస్థల నుంచి 11 శాతం రుణాలతో పాటు ఇంటర్ గ్రూప్ నుంచి 12- 13 శాతం అదానీ గ్రూప్ లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఆ సంస్థకు పీఎన్బీ రూ.7 వేల కోట్లు రుణం ఇచ్చింది.అయితే అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.