వైరల్: వెయిటర్‌ క్రియేటివిటీ... ఒకే చేతిపై 16 దోశ ప్లేట్స్‌ ఎలా తీసుకెళుతున్నాడో చూడండి!

దేశీయ బడా పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా వుంటూ తనకు నచ్చిన సన్నివేశాలను షేర్ చేస్తూ వుంటారు.ఈ క్రమంలో ఎంతోమంది ప్రతిభను అతను కొనియాడుతూ జనాలకు కూడా తెలియజేసేలా చేస్తుంటారు.

 Viral: Waiter Creativity,resturant, Taste,viral Latest, News Viral, Social Media-TeluguStop.com

అదే అతని ప్రత్యేకత.ఆయన తన పర్సనల్‌ విషయాల కంటే ఇతరులకు సంబంధించినటువంటి విషయాలనే వెలికి తీస్తూ వుంటారు.

ఇక వాటికి నెటిజన్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది అందరికీ తెలిసినదే.అవును, తాజాగా ఆనంద్‌ మహీంద్రా మరో ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు.

ఒక రెస్టారెంట్ లోని వెయిటర్‌ ఒకేసారి ఎన్ని ఆహార పదార్థాలు ఉన్న ప్లేట్లను తీసుకెళ్లగలడు? రెండు.మహా కాకపోతే మూడు.ఎందుకంటే అంతకు మించి తీసుకెళ్లడం కష్టం కాబట్టి.అయితే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఓ వెయిటర్‌ ఏకంగా 16 దోశలున్న ప్లేట్లను ఒకేసారి ఒకే చేతిపై తీసుకెళ్లడం గమనార్హం.ఏంటి? ఆశ్చర్యపోతున్నారా? అలా తీసుకెళ్లడమే కాదండోయ్‌.ప్రతి దోశ ప్లేట్‌ కస్టమర్ల టేబుల్ వద్దకెళ్లి స్వయంగా అతగాడే సర్వ్‌ చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం.

దీనికి సంబంధించినటువంటి వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా.‘మనం ‘వెయిటర్ ప్రొడక్టివిటీ’ని ఒలింపిక్ క్రీడగా గుర్తించాలి’ సరదాగా క్యాప్షన్‌ పెట్టడం గమనార్హం.

ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.ఒకసారి వీడియోని గమనిస్తే చెఫ్ దోశలను ఒక్కొక్కటిగా వేసి ప్లేట్లలో వేసి ఇస్తుంటే ఆ వెయిటర్ ఒకేసారి ఒకేకాలంలో దాదాపు 15, 16 ప్లేట్లను ఒకేచేతిపైన అమర్చుకొని సర్వ్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.నిజంగా అద్భుతం కదా.సదరు వీడియోని చూసి పెద్ద సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తున్నారు.అతడు మేజిక్ చేస్తున్నాడని ఒకరంటే, నా కళ్ళను నేను నమ్మలేకున్నానని కొందరు, పనిపట్ల నిబద్ధత ఉండడం అంటే ఇదే అని మరొకరు… ఇలా ఎవరికి నచ్చినవిధంగా వారు స్పందిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఆ వెయిటర్‌ ప్రతిభను మీరూ చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube