Raviteja : రవితేజ హీరోగా ఎదగడానికి పరోక్షంగా ఉపయోగపడిన మరో హీరో ఎవరో తెలుసా?

హీరో రవితేజ…( Hero Raviteja ) జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ మెల్లిమెల్లిగా హీరోగా ఎదిగాడు.హీరోగా తన కెరియర్ మొదలవడానికి ముందు చాలా సినిమాల్లో నటించాడు రవితేజ అయితే ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడంతో తనకు అంత త్వరగా అవకాశాలు రాలేదు.

 Raviteja Venu Thottempudi Rejected Movies-TeluguStop.com

అయినా కూడా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు.అయితే రవితేజ హీరోగా మారడం వెనుక అతడికే తెలియకుండా మరొక హీరో ఉన్నాడనే విషయం చాలా లేటుగా బయటకు వచ్చింది.

ఆ హీరో మరెవరో కాదు తొట్టెంపూడి వేణు( Thottempudi Venu ).తెలిసి తెలియక వేణు సైతం వదిలేసిన ప్రాజెక్టు తోనే రవితేజ హీరోగా ఎదిగాడు.

Telugu Itlusravani, Khadgam, Ashwini Dutt, Puri Jagannath, Ravi Teja, Venu-Movie

వేణు వదిలేసిన మొదటి సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం( Itlu Sravani Subramanyam ).ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ మొదట వేణు తప్ప మరొక హీరో సూట్ కాడని అనుకున్నాడు.అయితే నిర్మాత అశ్వినిదత్( Producer Ashwinidutt ) కి ఒక సినిమా చేసి పెడతాను అని వేణు ఇచ్చిన మాట కోసం ఆ సమయంలో పూరీ జగన్నాథ్ కి డేట్స్ కేటాయించలేక పోయాడు.దాంతో పూరి రవితేజ సంప్రదించగా ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు ఆ తర్వాత అది ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో నీకోసం అనే సినిమా లో మొదటిసారిగా రవితేజ హీరోగా నటించాడు.ఈ సినిమా మ్యూజికల్గా పెద్ద హిట్ అయింది.గమ్మత్తైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాలోని పాటలన్నీ కూడా హీరో వేణు తన సొంత సినిమా కోసం చేయించుకున్నాడు.

Telugu Itlusravani, Khadgam, Ashwini Dutt, Puri Jagannath, Ravi Teja, Venu-Movie

ఆర్పి పట్నాయక్( RP Patnaik ) సంగీత దర్శకత్వంలో సంగీతం చేయబడ్డ ఈ పాటలన్నీ కూడా పలు కారణాల వల్ల తన సినిమా క్యాన్సిల్ కావడంతో వేణు శ్రీను వైట్లకి ఇచ్చేశాడు.దాంతో రవితేజ కి తొలిసారి హిట్టు తన ఖాతాలో పడింది.ఇక కృష్ణవంశీ( Krishna Vamsi ) సైతం వేణు విషయంలో ఎప్పుడు సహృదయ భావంతోనే ఉండేవాడు.

అందుకే దాన్ని తీసిన ఖడ్గం( Khadgam ) సినిమాలో రవితేజ పాత్రను తొలత వేణు దగ్గరికి తీసుకెళ్లాడు కానీ కొన్ని కారణాల చేత వేణు ఆ సినిమాలో నటించకపోవడంతో తిరిగి అది రవితేజ చింతకే చేరింది దాంతో రవితేజ కెరియర్ లో మరోసారి ఒక పెద్ద సినిమా దొరికినట్లు అయింది.ఆ పలు కారణాల వల్ల రవితేజ కెరియర్ ను హీరో వేణు నిలబెట్టాడని చెప్పుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube