ధమాకా రివ్యూ: కామెడీతో అదరగొట్టేసిన మాస్ మహారాజ్!

డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మూవీ ధమాకా. మాస్ మహారాజ్ రవితేజ, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

 Raviteja Sri Leela Dhamaka Movie Review And Rating Details, Dhamaka Review, Mass-TeluguStop.com

ఇందులో జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు నటించారు.బీమ్స్ సిసి రోలియో సంగీతాన్ని అందించాడు.

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులలో చాలా ఆత్రుత ఏర్పడింది.

ఈ సినిమా లుక్స్, టైలర్ చూసి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.పైగా ఎనర్జిటిక్ పాత్రలను ఎంచుకునే రవితేజ కాబట్టి ఈ సినిమాపై మరింత హైప్  పెరిగింది.

ఇక మొత్తానికి ఈ సినిమా ఈరోజు థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా రవితేజకు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో రవితేజ ధమాకా స్వామి అనే పాత్రలో కనిపిస్తాడు.

ఇక ఇతడు మధ్యతరగతి కి చెందిన కుర్రాడు.ఇక ఇందులో స్వామికి ఎటువంటి లక్ష్యాలు ఉండవు.

కేవలం తన స్నేహితులతో సమయాన్ని గడుపుతూ లైఫ్ ని హ్యాపీగా చిల్ చేస్తూ ఉంటాడు.ఇక అదే సమయంలో తనకు శ్రీ లీలతో పరిచయం ఏర్పడుతుంది.

ఇక స్వామి ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఉంటాడు.

అదే సమయంలో ఆమెకు స్వామి లాగా పోలివున్న మరో వ్యక్తి ఆనంద్ చక్రవర్తి (రవితేజ) ఎదురవుతాడు.అతడు సీఈవో.అయితే ఇతడితో ఆమె ప్రేమలో పడటంతో అసలు కథ ఇక్కడి నుండి బాగా హైలెట్ అవుతుంది.

ఇక చివరికి ఏం జరుగుతుంది. శ్రీ లీలా ఎవరిని పెళ్లి చేసుకుంటుంది.మధ్యలో వచ్చే ట్విస్ట్ లు ఏంటి అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

నటినటుల నటన:

నటీనటుల విషయానికి వస్తే.రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాను కూడా తన భుజాలపై మోసాడు రవితేజ.  ఇక హీరోయిన్ శ్రీ లీల కూడా బాగా నటించింది.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ రొటీన్ కథ అందించినప్పటికీ సినిమా మాత్రం బాగుందని చెప్పవచ్చు.బీమ్స్ అందించిన అన్ని పాటలు మాత్రం హైలెట్ అయ్యాయని చెప్పవచ్చు.బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది.మిగిలిన సాంకేతిక విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.

విశ్లేషణ:

ఇక డైరెక్టర్ త్రినాధరావు ఈ సినిమా కథకు కొత్తదనం తీసుకొని రాలేదు.చాలావరకు రొటీన్ గా అనిపించింది.

ఇక రవితేజను మాత్రం అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.ఆయనతో కామెడీ ని కూడా బాగా పండించాడు.

పైగా డబల్ ధమాకా కాబట్టి కాస్త రొటీన్ కథ అయినప్పటికీ రాగానే చూపించండి డైరెక్టర్.

ప్లస్ పాయింట్స్:

రవితేజ నటన, కామెడీ, సంగీతం, కొన్ని సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ గా అనిపించింది.కొన్ని సన్నివేశాలు ఊహించినట్లుగా అనిపించాయి.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా రొటీన్ కథ అయినప్పటికీ కూడా మాస్ మహారాజ్ రవితేజ నటన కోసం, ఆయన కామెడీ కోసం చూడవచ్చని అర్థమవుతుంది.

రేటింగ్: 2/5

.

Raviteja Dhamaka Movie Genuine Public Talk Dhamaka Movie Review Sreeleela

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube