ఒత్తయిన జుట్టును ఎవరు కోరుకోరు చెప్పండి.స్త్రీలు అయినా పురుషులు అయినా తమ జుట్టు ఒత్తుగా పెరగాలని తెగ ఆరాటపడుతుంటారు.
అందుకోసం ఖరీదైన షాంపూ, ఆయిల్ వాడుతుంటారు.అయితే వాటి వల్లే జుట్టు ఒత్తుగా పెరిగిపోతుంది అనుకుంటే పొరపాటే.
జుట్టు ఒత్తుగా పెరగడానికి అప్పుడప్పుడు హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ లు, మాస్క్ లు కూడా వేసుకుంటూ ఉండాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్యాక్ ను వారంలో ఒక్కసారి వేసుకుంటే కనుక మీ హెయిర్ గ్రోత్ డబుల్ అవ్వడం ఖాయం.
మరి ఇంతకీ ఆ హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ వేసుకుని కనీసం ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న కలోంజి సీడ్స్‌ను చల్లారబెట్టుకోవాలి.కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
అలాగే మరోవైపు ఒక అలోవెరా ఆకు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ పౌడర్ వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంటపాటు షవర్ క్యాప్ ధరించాలి.
అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.వారంలో ఒక్కసారి ఈ విధంగా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.జుట్టు రాలడం, చిట్లడం, విరిగిపోవడం వంటి సమస్యలు ఉంటే క్రమంగా తగ్గుముఖం పడతాయి.అలాగే జుట్టు స్మూత్ అండ్ షైనీ గా సైతం మారుతుంది.
కాబట్టి ఒత్తయిన జుట్టు కావాలని కోరుకునేవారు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ను ట్రై చేయండి.