రావణాసుర ట్రైలర్ రెడీ.. డేట్ అండ్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్!

మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja ) హీరోగా సుధీర్ వర్మ ( Sudhir Verma )దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘రావణాసుర‘ ( Ravanasura ).ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.

 Ravi Tejas Ravanasura Trailer To Be Out On March 28th, Ravanasura Trailer, Ravan-TeluguStop.com

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రవితేజ ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని సక్సెస్ ను కంటిన్యూ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

ఈ క్రమంలోనే రావణాసుర సినిమా కోసం మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాయి.ఇటీవలే టీజర్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ కలిగేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ ఇస్తూ ఎప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల నోళ్ళలో నానేలా చేస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజను ఒక పవర్ ఫుల్ క్రిమినల్ లాయర్ గా అనేక హత్యలకు కారణం అయిన వ్యక్తిగా ”రావణాసుర”గా బాగా చూపించి ఆకట్టు కున్నారు.ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసారు.కొద్దీ సేపటి క్రితం మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను మార్చి 28న సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.

చూడాలి ట్రైలర్ ఎలా ఆకట్టు కుంటుందో.ఇక అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండగా.హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా.

ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రావణాసుర సినిమా రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube