మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో మొదటి సారి రవితేజ సోషియో ఫాంటసీ ఫార్ములాను రవితేజ ప్రయత్నించాడు.గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో రవితేజ కనిపించబోతున్నాడు.
ఈ సినిమా రవితేజ కెరీర్ లో చాలా కీలకం.

గత కొంత కాలంగా రవితేజ చేస్తున్న.చేసిన సినిమాలు ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద ఆడిన దాఖలాలు లేవు.అందుకే డిస్కో రాజా సినిమా కీలకంగా మారింది.
వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇప్పటికే విడుదల అయిన వీడియోలు మరియు ఫోటోలు సినిమాపై ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయ్యాయి.

డిస్కో రాజా సినిమా సక్సెస్ అయితేనే రవితేజ కొన్నాళ్ల పాటు హీరోగా కెరీర్ ను కాపాడుకోగలడు.ఈ సినిమా ఫలితం తారుమారు అయితే ఆయన కెరీర్ మరింత పాతాళానికి వెళ్లడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేసున్నారు.అందుకే ఈ సినిమా రవితేజకు లైఫ్ అండ్ డేట్ మ్యాటర్ అంటూ ఫ్యాన్స్ ఆందోళనతో ఉన్నారు.మరి రవితేజ ఎం చేస్తాడో చూడాలి.