సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైన సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు రవితేజ( Raviteja ) ఒకరు.నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి రవితేజ కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ ( Assistant Director ) గా పనిచేశారు అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.
ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఈయన హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇక రవితేజ హీరోగా నటిస్తూ వరుస సినిమాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదట్లో ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఒక డైరెక్టర్ హీరోయిన్ విషయంలో అందరి ముందు రవితేజను దారుణంగా అవమానించారట చివరికి హీరోయిన్ కి చెప్పులు తొడగమని చెప్పడమే కాకుండా అందరి ముందు రవితేజను దారుణంగా తిట్టారు అంటూ ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఒక హీరోయిన్ కి చెప్పులు ఇవ్వమంటూ డైరెక్టర్ రవితేజకు చెప్పారట.ఇక ఆయన చెప్పిన విధంగానే రవితేజ కూడా ఆ హీరోయిన్ కి చెప్పులు ఇచ్చారు అయితే ఆమె రవితేజ ఇచ్చినవి కాకుండా వేరే చెప్పులు ధరించడంతో కోపం వచ్చిన డైరెక్టర్ నేను చెప్పింది ఏంటి మీరు చేసేది ఏంటి అంటూ హీరోయిన్ ను అనడంతో హీరోయిన్( Heroine ) సైలెంట్ గా ఉండిపోయారట ఇక ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో అంతకుమించి డైరెక్టర్ ఏమీ మాట్లాడలేకపోయారని అయితే పక్కనే ఉన్నటువంటి రవితేజ పై ఆ కోపం చూపించారని తెలుస్తుంది.
అసలు నీకు బుద్ధుందా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసేదేంటి నేను ఏ చెప్పులు వేయమని చెప్పాను నువ్వు ఏం వేశావు అంటూ రవితేజ పట్ల అందరి ముందు దారుణంగా మాట్లాడుతూ ఆయనని అవమానించారు.ఆ డైరెక్టర్ రవితేజను ఇలా అవమానించడంతో రవితేజ ఏమీ మాట్లాడలేక వెళ్లి హీరోయిన్ కాళ్లు పట్టుకొని స్వయంగా ఆయనే చెప్పులు మార్చారట.ఇదంతా తన వల్లే జరిగిందని భావించిన ఆ హీరోయిన్ నా వల్లే నీకు తిట్లు పడ్డాయి నన్ను క్షమించు అంటూ రవితేజకు క్షమాపణలు చెప్పారట.ఈ విధంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నటువంటి రవితేజ సినిమా అవకాశాలను అందుకొని ఇప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి ఇలా ఈయన సక్సెస్ వెనక ఎన్నో అవమానాలు ఉన్నాయని తెలుస్తోంది.