దోస పంటను ఆశించే బూజు తెగులను నివారించేందుకు చర్యలు..!

తీగ జాతి కూరగాయలలో దోస పంట( Cucumber Cultivation ) కూడా ఒకటి.ఈ పంటకు ఆశించే బూజు తెగులు ఫంగస్ వల్ల సోకుతుంది.

 Actions To Prevent The Powdery Mildew That Expects The Dosa Crop , Cucumber Cult-TeluguStop.com

ఈ ఫంగస్ పచ్చగా ఉండే మొక్కలపై జీవిస్తుంది.భారీ తేమ, పొగ మంచు, నీటి బిందువుల ఆధారంగా దోస మొక్కలను ఆశిస్తుంది.

శీతాకాలంలో తెగులు సోకిన మొక్కల అవశేషాలలో లేదా మొక్కల చిగురులలో ఈ ఫంగస్ జీవించే ఉంటుంది.

బూజు తెగులు పంటను ఆశించినప్పుడు మొక్కల ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.పసుపు రంగు మచ్చలు క్రమేనా గోధుమ రంగులోకి మారతాయి.అకు అడుగు భాగంలో నానినట్టు ఉండే మచ్చలు ఏర్పడతాయి.

క్రమంగా ఈ మచ్చలు బూడిద రంగులోకి మారి ఆకు కింద బూజు పెరుగుతుంది.ఈ బూజు తెగుల వల్ల లేత చిగుర్లు, పువ్వులు, పూత, కాయలు ఎదగకుండా చనిపోతాయి.

మొక్కలో ఎదుగుదల లోపిస్తుంది.ఈ బూజు తెగులు ఒకసారి వస్తే తొలగించడం చాలా కష్టం.

బూజు తెగులు పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులు నిరోధక విత్తనాలను( Pest resistant seeds ) ఎంపిక చేసుకుని విత్తుకోవాలి.మొక్కల మధ్య సరైన దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.నీటిని రాత్రి పూట కాకుండా పగటిపూట మాత్రమే పంటకు అందించాలి.పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.మొక్కల తీగలు నేలకు తగలనీయకుండా పందిరికి కట్టాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపును నివారించాలి.

పంట కోత తర్వాత పంట అవశేషాలను పూర్తిగా తొలగించాలి.సేంద్రీయ పద్ధతిలో బోర్డియాక్స్ మిశ్రమం లాంటి కాపర్ ఆధారిత సేంద్రియ శిలీంద్ర నాశినులను వాడడం వల్ల ఫంగస్ వలన కలుషితం కాకుండా ఆపొచ్చు.

రసాయన పద్ధతి( Chemical method )లో అయితే ఫ్లూపికొలైడ్, మొఫెనోక్సామ్, జక్సామైడ్ లాంటి పిచికారి మందులను ఉపయోగించి ఫంగస్ ను నియంత్రించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube