రవితేజ పాత రోజులను గుర్తు చేస్తున్నాడు భయ్యా.. చేతిలో అరడజను సినిమాలు

మాస్ మహా రాజా రవితేజ( Ravi Teja ) వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

ధమాకా( Dhamaka ) సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

వచ్చే నెలలో రావణాసుర సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అంతే కాకుండా టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమా కూడా లైన్ లో ఉంది.

ఇదే ఏడాది ఆ సినిమా కూడా విడుదల అవ్వాల్సి ఉంది.ఇన్ని సినిమాలు చేస్తున్న రవితేజ మరో వైపు ఇటీవలే వీరు పోట్ల దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే.

మరో వైపు రవితేజ రెండు సినిమాలు కూడా కమిట్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.ఇన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో రవితేజ చేసిందే లేదు.

Advertisement

ఇంత స్పీడ్ గా సినిమా లు పదేళ్ల క్రితం రవితేజ చేసేవాడు.అందులో చాలా సినిమాలు ఫెయిల్‌ అయ్యేవి.

దాంతో మెల్ల మెల్లగా సినిమాల యొక్క సినిమాల సంఖ్యను తగ్గించాడు.

తద్వారా రవితేజ పనైపోయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ ఇప్పటికి కూడా రవితేజ జోరు కంటిన్యూ అవుతూనే ఉంది.హీరోగా రవితేజ బిజీగా ఉన్నాడు.

ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.అందుకే వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇన్ని సినిమాలు చేస్తున్న రవితేజ జోరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో రవితేజ కి ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పటికే అర్థం అయింది.

Advertisement

మరో అయిదు ఆరు సంవత్సరాల పాటు ఆయన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ భారీగా రాబోతున్నాయి.ఈ స్థాయిలో ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే పాత రవితేజ గుర్తుకు వస్తున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు