రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ధమాకా.ఈ సినిమా లో రవితేజ కు జోడి జోడిగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా లో రవితేజ మరియు ఆమె రొమాన్స్ పిక్స్ లో ఉంటుంది అని అలాగే ఇద్దరి మధ్య లవ్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి అంటూ చిత్రాన్ని సభ్యులు ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు.ఇక రవితేజ మరియు ఆమెకి మధ్య ఉండే సన్నివేశాలను కొన్ని వర్గాల ప్రేక్షకులు తిరస్కరిస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కారణం వారిద్దరి మధ్య వయసు తేడా కాస్త ఎక్కువ అనే విషయం అందరికి తెలిసిందే.ఆ విషయం పక్కన పెడితే నేడు వినాయక చవితి సందర్భంగా సినిమా కు సంబంధించిన ఒక లవ్ కమ్ రొమాంటిక్ గ్లిమ్స్ ని విడుదల చేయడం జరిగింది.
అందులో ఒక పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లిలో హీరోయిన్ మరియు హీరో ఉంటారు.హీరోయిన్ ని అలా పక్కకు రమ్మంటూ హీరో సైగ చేస్తాడు.
కానీ హీరోయిన్ మాత్రం మొదట మొహమాటంతో రాను అంటుంది.అప్పుడు హీరో జాలిగా మొహం పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లుగా ఏడుపు ముఖం పెట్టడంతో హీరోయిన్ సరే అంటూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
సినిమాలో మంచి లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నట్లుగా ఈ వీడియోని చూస్తుంటే అనిపిస్తుంది అంటూ రవితేజ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందని ఈ సంవత్సరం లోనే ధమాకా సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇటీవల సభ్యులు పేర్కొన్నారు.
సినిమా నుండి వస్తున్న పాటలు మరియు టీజర్ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి కనుక త్వరలోనే సినిమా ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







