మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర.యునిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి.
ఇందులో హీరో సుశాంత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు.అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.ప్రొడక్షన్ డిజైనర్ డిఆర్కె కిరణ్ పర్యవేక్షణలో నిర్మించిన 5 కోట్ల రూపాయల భారీ సెట్‌లో క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
స్టన్ శివ స్టైలిష్, డిఫరెంట్ యాక్షన్ బ్లాక్‌ని డిజైన్ చేసారు.ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ లు అభిమానులకు, ప్రేక్షకులకు కన్నుల పండగలా ఉండబోతున్నాయి.పోస్టర్లలో రవితేజ లుక్ కు భారీ స్పందన వచ్చింది .అలాగే సుశాంత్ స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా ఆసక్తికరంగా వుంది.సినిమాలో రవితేజ యాక్షన్‌తో కూడిన లాయర్ పాత్రను పోషిస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు.
సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.