జనసేన బీజేపీ పరువు ఆ మాజీ ఐఏఎస్ నిలబెడతారా ?

చాలా రోజులుగా బీజేపీ జనసేన పార్టీలు తిరుపతి ఉప ఎన్నికల పై ఫోకస్ పెట్టాయి.ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా బాగా యాక్టివ్ అయ్యాయి.

ఇక్కడ బిజెపి జనసేన పార్టీ లలో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత లేక పోయినప్పటికీ, రెండు పార్టీలు ముమ్మరంగానే ఇక్కడ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి.ఎవరికి వారు విడివిడిగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నడుస్తోంది.టిడిపి వైసిపి పార్టీలు ఈ రెండు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టగా,  బిజెపి మాత్రం దానికి భిన్నంగా తిరుపతి ఉప ఎన్నికలపై ఫోకస్ బాగా పెంచింది.

ఈ నేపథ్యంలో తిరుపతి లో పోటీ చేయబోయే అభ్యర్థిని ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement

మొన్నటి వరకు బీజేపీ , జనసేన పార్టీలలో ఎవరు పోటీ చేయాలనే విషయంలో ప్రతిష్టంభన కొనసాగింది.ఒక దశలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడానికి  కారణం అయ్యాయి.ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను పోటీకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ కర్ణాటక్యాడర్ ఐఏఎస్.వివిధ రకమైన పదవులను నిర్వహించారు.

అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.ముక్కుసూటితనం గా ముందుకు వెళ్లే ఆమె అయితేనే తిరుపతి లోకసభ ఎన్నికలు వైసీపీ అభ్యర్ధులను బలంగా ఢీ కొట్టగలరు అనే నమ్మకాన్ని బిజెపి అగ్రనేతలు వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఆమెని బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు.అయితే దీనికి ముందు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు రావెల కిషోర్ బాబు పేరు తెరపైకి వచ్చినా, ఆయన అభ్యర్థిత్వాన్ని జనసేన వ్యతిరేకించినట్టు సమాచారం.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024

ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి , వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో వారికి ధీటుగా ఈ మాజీ ఐఏఎస్ ను రంగంలోకి దించాలి అని చూస్తున్నారట.బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థినిగా ప్రచారంలోకి వచ్చిన మాజీ ఐఏఎస్ రత్న పభ 2018 లో రిటైర్ అయ్యారు.2019లో ఆమె బీజేపీలో చేరారు.ఆమె కర్ణాటక బిజెపి లో యాక్టివ్ గా ఉంటున్నారు.

Advertisement

ప్రస్తుతం ఆమె కర్నాటక ను వదిలి ఏపీ కి వచ్చి పోటీ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ఒకవేళ ఆమె తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు ఒప్పుకున్నా, ఆమె ఎంత మేరకు బిజెపి జనసేన ఆశలు తీరుస్తారు అనేది తేలాల్సి ఉంది.

తాజా వార్తలు