సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు సంక్రాంతి, సమ్మర్, దసరా పండుగ సమయంలో తమ సినిమాలను విడుదల చేయాలని భావిస్తూ ఉంటారు.సంక్రాంతి, దసరా పండుగల సమయంలో, సమ్మర్ లో ఎక్కువగా సెలవులు ఉంటాయి కాబట్టి కలెక్షన్లు ఎక్కువగా వస్తాయని దర్శకనిర్మాతలు అనుకుంటారు.
ప్రతి సంవత్సరంలా ఈ ఏడాది సమ్మర్ లో భారీ సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి.
ఇప్పటికే పలువురు దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్లను ప్రకటించగా అరణ్య, రంగ్ దే, వకీల్ సాబ్, లవ్ స్టోరీ, టక్ జగదీష్, మరికొన్ని సినిమాలు సమ్మర్ లో విడుదల కానున్నాయి.
అయితే ప్రతి సంవత్సరం సమ్మర్ లో విడుదలైన సినిమాలు భారీ కలెక్షన్లను సాధించగా ఈ ఏడాది విడుదలైన సినిమాలు భారీ కలెక్షన్లను సాధించడం కష్టమేనని తెలుస్తోంది.ప్రతి సంవత్సరం మార్చి నెల చివరివారం నాటికి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యేవి.
అయితే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ చివరి వారం నుంచి మే నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి.అందువల్ల ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం రెవిన్యూ రాబట్టడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్ టాక్ ను సంపాదించుకుని భారీ కలెక్షన్లను రాబట్టాయి.
స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫీవర్ లో ఉంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సినిమాలపై ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఈ కారణం వల్లే పలువురు దర్శకనిర్మాతలు తమ సినిమాలను సమ్మర్ తరువాత విడుదల చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.సమ్మర్ లో రిలీజై సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా సమస్య లేదు కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉంది.