Rathika Rose: ఆ బిగ్ బాస్ విన్నర్ తో ప్రేమలో పడి మోసపోయిన రతిక.. నిజమేనా..?

చాలామంది బిగ్ బాస్ ( Bigg Boss ) మొదటి మూడు సీజన్ లకు చాలా అట్రాక్ట్ అయ్యారు.

దాంతో చాలామంది ఈ రియాల్టి షో చూడడానికి మొగ్గు చూపించారు.

అయితే సీజన్స్ దాటుతున్న కొద్దీ ఎవరికి తెలియని కంటెస్టెంట్లని హౌస్ లోకి తీసుకురావడంతో దీనిపై ప్రేక్షకులకు బోర్ కొట్టింది.మరీ ముఖ్యంగా గత ఆరో సీజన్ అయితే పరమ చెత్త రికార్డుని క్రియేట్ చేసి ఇక తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో రాదు అనే విధంగా చేశారు.

అయితే బిగ్ బాస్ 6 సీజన్ పై ఉన్న నిరాశను పోగొట్టి బిగ్ బాస్ 7 ( Biggboss7 ) ని సరికొత్తగా తీసుకురావాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు.ఇక ఈ సీజన్ అంత ఉల్టా పల్టా ఉంటుందని ఎవరు ఊహించని విధంగా ఈ సీజన్ ఉండబోతుంది అంటూ ఎన్ని వార్తలు వినిపించినప్పటికీ ఎప్పటిలాగే చప్ప చప్పగా కనిపిస్తోంది.

ఇది పక్కన పెడితే ఈ సీజన్లోకి నటి రతిక రోజ్ ( Rathika Rose ) రావడంతోనే మంచి జోష్ తో వచ్చింది.ఇక డాన్స్ పర్ఫామెన్స్ అయిపోయాక స్టేజ్ మీద నాగార్జున దగ్గరికి రావడంతోనే నాగార్జున (Nagarjuna) తన లవ్ ఫెయిల్యూర్ విషయాన్ని హార్ట్ బ్రేక్ అయ్యిందనే విషయం గురించి మాట్లాడుకున్నారు.అలాగే హౌస్ లోకి వెళ్ళాక చూపిస్తా అంటూ రతిక సూపర్ యాక్టివ్ గా హౌస్ లోకి వెళ్ళింది.

Advertisement

ఇక రతిక ఈ విషయం చెప్పడంతో రతిక ఎవరితో ప్రేమలో మోసపోయింది.ఎవరిని ప్రేమించింది అని చాలామందిని నెటిజన్స్ ఈమె గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఆత్రుత చూపించారు.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నటి రతిక రోజ్ ( Rathika Rose ) ప్రేమలో పడింది ఆ మాజీ కంటెస్టెంట్ అంటూ కూడా ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది.

అయితే తాజాగా ఆ మాజీ కంటెస్టెంట్ పేరుతో సహా సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.ఇక రతిక రోజ్ ప్రేమించి బ్రేకప్ అయ్యింది ఎవరితోనో కాదు.బిగ్ బాస్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ( Rahul Sipligunj ) అని తెలుస్తోంది.

రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి రతిక దిగిన ఫోటోలు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో రతిక రోజ్ కి రాహుల్ కి మధ్య ప్రేమాయణం నడిచిందని, కానీ కొన్ని కారణాల వల్ల వీరిమధ్య బంధం తెగిపోవడంతో బ్రేకప్ జరిగింది అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు