ఆరోజు ఖచ్చితంగా మోసం చేస్తా.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాల ద్వారా వార్తల్లో నిలిచి వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్న రష్మిక మందన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అలవాట్లకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.రోజురోజుకు రష్మిక క్రేజ్ పెరుగుతుండగా రష్మిక గ్లామర్ కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

 Rashmika Sensational Comments Goes Viral In Social Media Details Here , Rashmika-TeluguStop.com

ఫిట్ నెస్, ఆహార నియమాల విషయంలో రష్మిక తీసుకునే జాగ్రత్తలు అన్నీఇన్నీ కావు.

తాజాగా వర్కౌట్స్ గురించి ఈ బ్యూటీ స్పందిస్తూ హీరోయిన్ గా అడుగు పెట్టే సమయానికి నాకు ఫిట్ నెస్ పై శ్రద్ధ లేదని ఫిట్ గా ఎలా ఉండాలి? గ్లామర్ ను ఎలా కాపాడుకోవాలి ? అనే విషయాలపై నాకు అంతంత మాత్రమే అవగాహన ఉందని ఆమె కామెంట్లు చేశారు.అయితే ఈ విషయాలపై దృష్టి పెడితే మాత్రమే నటిగా ఎదగడం సాధ్యమవుతుందని తెలుసని రష్మిక చెప్పుకొచ్చారు.

Telugu Chalo, Diet, Hyderabad, Naga Shourya, Rashmika, Tollywood, Workout-Movie

ఛలో మూవీ సక్సెస్ సాధించిన వెంటనే ఫిజికల్ ట్రైనర్ ను నియమించుకోవడం జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.ఆ ఫిజికల్ ట్రైనర్ సహాయంతో ఫిట్ నెస్ ను కాపాడుకుంటున్నానని రష్మిక తెలిపారు.ఉదయం లేచిన వెంటనే లీటర్ నీళ్లు తాగడంతో నా దినచర్య మొదలవుతుందని రష్మిక కామెంట్లు చేయడం గమనార్హం.

రోజుకు 2 గంటలు వర్కౌట్స్ చేస్తానని ఆమె అన్నారు.

Telugu Chalo, Diet, Hyderabad, Naga Shourya, Rashmika, Tollywood, Workout-Movie

పవర్ యోగా తప్పనిసరిగా చేస్తానని స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, జాగింగ్, స్కిప్పింగ్ చేస్తానని ఆమె తెలిపారు.గతంలో బ్యాడ్మింటన్ బాగా ఆడేదానినని ఇప్పుడు వాలీబాల్ మస్ట్ అని ఆమె కామెంట్లు చేశారు.వారంలో ఒక్కరోజైనా చీటింగ్ డే ఉంటుందని ఆరోజు స్వీట్స్ బాగా తింటానని హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని అన్నారు.

నా ఫ్రెండ్స్ భోజన ప్రియులని వాళ్లతో కూర్చుంటే డైటింగ్ అనే మాటను మరిచిపోతానని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube