కన్నడ సినీ పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమై, తెలుగు సినీ పరిశ్రమ ద్వారా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రష్మిక మందన.( Rashmika Mandanna ) కేవలం రెండు మూడు సినిమాలతోనే ఈమెకి స్టార్ స్టేటస్ దక్కింది.
సౌత్ లో స్టార్ స్టేటస్ దక్కిన వెంటనే ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి.అలా మొదటి సినిమాతోనే ఆమెకి రణబీర్ కపూర్( Ranbir Kapoor ) లాంటి సూపర్ స్టార్ తో కలిసి నటించే ఛాన్స్ దక్కింది.
అది కూడా ‘ఎనిమల్ ‘( Animal Movie ) లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో.ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.దాదాపుగా 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది ఈ చిత్రం.‘సలార్ ‘ చిత్రం విడుదల వల్ల ‘ఎనిమల్’ వసూళ్లు ఆగిపోయాయి.లేకపోతే ఆ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిలు వసూలు చేసి ఉండేది అని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా లో రష్మిక నటన కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఆమె కెరీర్ లో ఇది బెస్ట్ రోల్ అనే చెప్పొచ్చు.ఆర్టిస్టుల నుండి పెర్ఫార్మన్స్ మొత్తాన్ని పిండుకోవడం సందీప్ వంగ కి( Sandeep Vanga ) బాగా అలవాటు.
అర్జున్ రెడ్డి మేకింగ్ వీడియోస్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఎన్ని టేకులు అయినా చేయిస్తాడు.కానీ కోపం తెచ్చుకోడు.ఎదుటి ఆర్టిస్టుకి చిరాకు కలిగినా కూడా పట్టించుకోడు.
అలాంటి ఔట్పుట్ ని రాబట్టుకుంటున్నాడు కాబట్టే చేసింది మూడు సినిమాలే అయినా ఇండియాని షేక్ చేసాడు.ఇక ఈ చిత్రంలో కర్వా చౌత్ సన్నివేశం కి( Karva Chauth Scene ) థియేటర్స్ లో ఆడియన్స్ నుండి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము.
ఈ సన్నివేశం లో రష్మిక హీరో రణబీర్ కపూర్ చెంప మీద బలంగా కొట్టాలి.

ఈ సన్నివేశం కేవలం ఒకటి రెండు టేకులలో అయిపోలేదట.సందీప్ వంగ కి 20 టేకులు తీస్తే కానీ నచ్చలేదట.20 టేకులు అంటే 20 సార్లు రష్మిక చేత చంప పగలగొట్టించుకున్నాడు అన్నమాట.అన్ని సార్లు కొట్టించుకున్న కూడా కేవలం ఒక మాట కూడా అనలేదట హీరో రణబీర్ కపూర్. అలాంటి డెడికేషన్ ఉన్న నటుడిని చూడడం చాలా తక్కువ అని పొగడ్తలతో ముంచి ఎత్తేసింది రష్మిక మందన.
ఈ సినిమా సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఆమె ‘పుష్ప : ది రూల్’( Pushpa: The Rule ) చిత్రం కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.వచ్చే ఏడాది ఆగష్టు 15 వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుంది.