అయ్య బాబోయ్.. రష్మిక ఇన్ని సినిమాలకు నో చెప్పిందా?

చలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన చల్ చలో చలో అంటూ ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతుంది.

వరుస అవకాశాలు అందుకుంటూ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తుంది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది.

ఇక ఇప్పటి వరకు ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయిందని చెప్పాలి.ఇదిలా ఉంటే అటు రష్మిక తన కెరీర్లో ఎన్నో సినిమాలను వదిలేసిందట.

ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పాత్రలో రష్మిక మందన అనుకున్నారట.

Advertisement

కానీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో రష్మిక ఈ పాత్రకు నో చెప్పేసిందట.కానీ రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చిన కారణంగానే పూజాహెగ్డే సినిమా చేసినట్టు టాక్ వుంది.

రష్మిక హీరోయిన్ గా మారిన కిరిక్ పార్టీ మూవీ అదే టైటిల్ తో హిందీలో రీమేక్ చేస్తుండగా ఈ సినిమాలో నటించేందుకు రష్మిక నో చెప్పడంతో కృతిసనన్ తీసుకున్నారు.నాని నటించిన జెర్సీ సినిమా హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేయగా ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా రష్మిక ను అనుకున్నారట.

కానీ రష్మికా నో చెప్పడంతో చివరికి మృణాల్ సేన్ ని తీసుకున్నారు.

ఇళయ దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో కూడా పూజా హెగ్డే కి బదులు రష్మిక ను అనుకున్నారట.కానీ కథ నచ్చక నో చెప్పిందట రష్మిక మందన.దీంతో పూజా హెగ్డే ఈ ఆఫర్ దక్కించుకుంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఇక నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాలో రష్మిక అయితే బాగుంటుందని అనుకున్నారట మేకర్స్.కానీ ఈ అమ్మడు నో చెప్పడంతో చివరికి నజ్రియాను తీసుకున్నారు.

Advertisement

ఈ సంక్రాంతికీ సూపర్ హిట్ సాధించిన బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి నటించిన పాత్ర కోసం రష్మిక ను తీసుకోవాలి అనుకున్నారు.కానీ అది కుదరలేదు.వీటితో పాటు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ శర్వానంద్ మహాసముద్రం సహా అటు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి లాంటి పలువురు దర్శకులు ఇచ్చిన ఆఫర్లు కూడా రష్మికా నో చెప్పిందట.

దీన్ని బట్టి చూస్తే రష్మీక తన కెరీర్ను ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.

తాజా వార్తలు