టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.దాంతో పాటు తమిళంలో కార్తీతో కూడా జోడీ కట్టబోతుంది.లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ లు వాయిదా పడటంతో అమ్మడు సొంతూరు అయిన కూర్గ్ చెక్కేసింది.
అక్కడ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది.తన లైఫ్ లో దొరికిన ఈ ఫ్రీ టైంని భాగా ఉపయోగించుకొని కుటుంబంతో గడుపుతుంది.
మళ్ళీ షూటింగ్ లు మొదలైతే ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం రాదనీ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.ఇదలా ఉంటే షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చిన కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండటంతో నిర్మాతలు ధైర్యం చేసి ముందుకి రాలేకపోతున్నారు.
ఓ విధంగా షూటింగ్ లు వాయిదా వేయడం వలన నష్టం అయిన కూడా తప్పని సరి పరిస్థితిలో సైలెంట్ గా ఉంటున్నారు.పరిస్థితుల బట్టి ఆగష్టులో కొంత మంది షూటింగ్ లు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.
ఇందులో అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా ఉంది.ఇదిలా ఉంటే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం కరోనా టైంలో షూటింగ్ అంటే భయపడిపోతున్నారు.
కాని రష్మిక మాత్రం నేను షూటింగ్ లకి రెడీ అంటుంది.ఈ సమయంలో మీరు షూటింగ్‌కు రెడీగా వున్నారా అని ఈ అమ్మడిని ప్రశ్నిస్తే నా దర్శక, నిర్మాతలు షూటింగ్‌కు రమ్మని అంటే తప్పకుండా వస్తాను.
తగు జాగ్రత్తలు పాటిస్తూ నేను చిత్రీకరణలో పాల్గొంటాను.ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రస్తకే లేదు అని ఖరాఖండిగా చెప్పింది.