టాలీవుడ్ ప్రేక్షకులకు రష్మిక మందన్న( Rashmika Mandanna ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇంట అడుగుపెట్టి.
ఫస్ట్ లుక్ ది బెస్ట్ లుక్ అనిపించుకొని తన నటనకు గాను ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ప్రస్తుతం సినీ రంగంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ వెలుగు వెలుగుతుంది.
అంతేకాకుండా ఇండియన్ క్రష్ గా కూడా ఈ బ్యూటీ కి ఒక ట్యాగ్ తగిలించారు తన అభిమానులు.

ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా ఛలో సినిమా( Chalo Movie )తో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత ఆ పై వచ్చిన అంజనిపుత్ర, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు అందుకుంది.టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ పొందింది.అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ.
ఇండియన్ క్రష్ గా ఓ ఊపు ఊపుతుంది.

గత ఏడాది వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప'( Pushpa ) సినిమాలో వేరే లెవెల్ లో మెప్పించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మరింత ఎక్కువగా పెరిగింది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లిస్టులో రష్మిక కూడా ఒకరు.ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అడ్వర్టైజ్మెంట్లు కూడా చేస్తూ ఉంది.
సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.
ఈమెకు బాగా ట్రోల్స్( Trolls ) కూడా వస్తుంటాయి.ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.
వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.ఇక ఈమెకు ఎంతమంది అభిమానులు అంతమంది హేటర్స్ ఉన్నారని చెప్పాలి.
ఎందుకంటే అప్పుడప్పుడు ఈమె చేసే షో అలా ఉంటుంది కాబట్టి.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే తను ఆశతో తొందరపడి కెరీర్ నాశనం చేసుకుంటుందని తెలుస్తుంది.అసలు విషయం ఏంటంటే.
తను తమిళ స్టార్ హీరో విక్రమ్( Hero Vikram ) తో పాన్ ఇండియా మూవీలో చేస్తుందని టాక్ వినిపించింది.ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వటంతో వెంటనే జనాలు.
విక్రమ్ పక్కన రష్మిక నటించడం ఏంటి.స్టార్ హీరో అని బాగా ఆశ పడుతున్నట్టు ఉంది.
ఇలా అయితే ఆమె కెరీర్ ముగిసినట్లే అని.అంటున్నారు.ప్రస్తుతం పుష్ప 2 లో బీజీగా ఉంది.అంతేకాకుండా హిందీలో, తమిళంలో వరుస మూవీస్ చేస్తుంది.ఇక ఈ సినిమాలు తనకు ఎటువంటి సక్సెస్ లు అందిస్తాయో చూడాలి.







