డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salman) మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం సీతారామం(Sitaramam).ఇలా తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ జంట ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వీరికి తెలుగులో కూడా విపరీతమైన అభిమానులు పెరిగిపోవడమే కాకుండా మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.అయితే ఈ అందమైన ప్రేమ కథ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది అవుతున్నటువంటి సందర్భంగా నటి మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ డియర్ ఆడియన్స్ నటిగా నా మొదటి సినిమా సీతారామం సినిమా పట్ల నేను కన్నా కళలను మించి నాపై ప్రేమ అభిమానాలు చూపిస్తూ నన్ను మీ తెలుగింటి అమ్మాయిగా ఆదరించారు.ఈ ప్రయాణంలో అంతులేని ప్రేమను చూపించిన తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు.ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది ఇలాగే మరికొన్ని విభిన్న కథా చిత్రాల ద్వారా మీకు మంచి వినోదాన్ని అందిస్తాను అంటూ ఈ సందర్భంగా తెలుగు సినిమా( Telugu Cinema ) పట్ల తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ విధంగా తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి మాత్రమే కాకుండా చిత్ర బృందాన్ని ఉద్దేశించి కూడా ఈమె కొన్ని విషయాలను తెలియజేశారు.నా నుంచి సీత బెస్ట్ వర్షన్ స్క్రీన్ పైకి తీసుకువచ్చిన డైరెక్టర్ హానురాగవపుడికి(Hanu Raghavapudi) ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన దుల్కర్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ పోస్టులు షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమా తర్వాత మృణాల్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.







