పుష్ప 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన రష్మిక... ఏం చెప్పారంటే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లు నటించిన చిత్రం పుష్ప.

ఈ సినిమా 2021 డిసెంబర్ నెలలో విడుదలయి బాక్సాఫీస్ సంచలనాలు సృష్టించింది.

ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించి శర గంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లోభాగంగా అల్లు అర్జున్ ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు.

అయితే ఈ సినిమా షూటింగులో రష్మిక ఇప్పటివరకు బాగం అవలేదు.దీంతో పుష్ప సీక్వెల్ సినిమాలో రష్మిక లేదని వార్తలు పుట్టుకొచ్చాయి.

రష్మిక బదులు వేరే హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతుందని వార్తలు వచ్చాయి.రష్మిక కూడా ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో ఈ సందేహాలు వ్యక్తం అయ్యాయి.అయితే ఈమె నటించిన మిషన్ మజ్ను వారసుడు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లతో రష్మిక బిజీగా ఉన్నారు.

Advertisement

అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక పుష్ప 2 గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని వచ్చే నెలలో తాను కూడా ఈ సినిమా షూటింగ్లో భాగం కాబోతున్నానని ఈమె ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.ఇక ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి అయిందని సెకండ్ పార్ట్ లో స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి తాను చాలా ఎగ్జైట్ గా ఉన్నానని రష్మిక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఇలా రష్మిక పుష్ప 2 గురించి అప్డేట్ ఇవ్వడంతో ఈమె గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు