ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన తాప్సీ ప్రస్తుతం తెలుగు కంటే హిందీలో ఎక్కువగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.తాప్సీ రష్మీ రాకెట్ అనే సినిమాలో నటించగా త్వరలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.
స్పోర్ట్స్ డ్రామాగా రష్మీ రాకెట్ తెరకెక్కగా సినిమాలోని తాప్సీ లుక్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తుండటం గమనార్హం.ఇప్పటికే రిలీజైన రష్మీ రాకెట్ ట్రైలర్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరి కొందరు నెటిజన్లు మరో వాల్దీ బాడీ అంటూ తాప్సీ లుక్ గురించి కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అయితే తాప్సీపై గతంలో కూడా పలు సందర్భాల్లో ట్రోలింగ్ జరిగింది.
ఒక ఇంటర్వ్యూలో తాప్సీకి ట్రోలింగ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురు కాగా ఆ ప్రశ్నల గురించి తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నెటిజన్లు తనను ట్రోల్ చేయడం లేదని ఆ కామెంట్లు తనకు కాంప్లిమెంట్లు అని తాప్సీ చెప్పుకొచ్చారు.
తాను అథ్లెట్ లుక్ లో కనిపించడం కొరకు ఎంతో శ్రమించి వ్యాయామాలు చేశానని తాప్సీ వెల్లడించారు.

చాలామంది తనను మగాడివని పేర్కొనడం తనను ప్రశంసించడమే అని తాప్సీ వెల్లడించారు.సోషల్ మీడియా ద్వారా వ్యక్తమవుతున్న నెగిటివ్ కామెంట్లను తాప్సీ పాజిటివ్ పబ్లిసిటీగా మార్చుకుంటూ ఉండటం గమనార్హం.తాప్సీ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.