ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి షాకిచ్చిన రాశీఖన్నా.. ఏం జరిగిందంటే?

ఊహలు గుసగుసలాడే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన రాశీఖన్నా తొలి సినిమాతోనే విజయాన్ని ఖాతాలో వేసుకోగా హీరోయిన్ గా రాశీఖన్నా అభినయానికి సైతం మంచి మార్కులు పడ్డాయనే సంగతి తెలిసిందే.

ఆ తర్వాత యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు సైతం జోడీగా నటించే అవకాశం రాశీఖన్నాకు దక్కింది.

జై లవకుశ సక్సెస్ రాశీఖన్నా కెరీర్ కు ప్లస్ అయిందనే విషయం తెలిసిందే.అయితే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మాత్రం రాశీఖన్నా కెరీర్ కు మైనస్ అయింది.

ఆ సినిమాలో రాశీఖన్నా బోల్డ్ రోల్ లో నటించగా ఆ పాత్ర రాశీఖన్నా కెరీర్ కు ఏ మాత్రం హెల్ప్ కాలేదు.అయితే రాశీఖన్నా ప్రస్తుతం థాంక్యూ సినిమాతో పాటు పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తున్నారు.

రాశీఖన్నా చేతిలో నాలుగు తమిళ సినిమాలు సైతం ఉన్నాయి.రెండు వెబ్ సిరీస్ లలో కూడ రాశీఖన్నా నటిస్తుండటం గమనార్హం.

Advertisement

అయితే రాశీఖన్నా ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నారు.

రాశీఖన్నా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.బొద్దుగా ఉన్న రాశీఖన్నా స్లిమ్ లుక్ లోకి మారిపోవడంతో పాటు చాలా సంతోషంగా ఉన్నారని ఆమె ముఖం చూస్తుంటే అర్థమవుతోంది.సోషల్ మీడియాలో రాశీఖన్నా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాశీఖన్నా అన్ని భాషల్లో అవకాశాలను సంపాదించుకుంటూ సత్తా చాటుతున్నారు.అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఇప్పటికీ రాశీకి ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. రాశీఖన్నాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

 టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్, ప్రభాస్ లకు జోడీగా నటించే అవకాశం రాశీఖన్నాకు దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు