లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఒకటి అనే విషయం అందరికి తెలిసిందే.అక్కడ చదవాలంటే విద్యార్ధికి అత్యున్నతమైన ప్రతిభాపాటవాలు కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది.
ఎంతో మందికి ఎంతో గొప్ప జీవితాలను ఇచ్చి, మరింత నిష్ణాతులుగా తీర్చి దిద్దే యూనివర్సిటీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఈ విశ్వవిద్యాలయం.అలాంటి విశ్వ విద్యాలయంలో ఓ విభాగానికి ఓ భారతీయ శాస్త్ర వేత్త పేరును పెట్టడం అంటే మామూలు విషయం కాదు.
ఇలాంటి అరుదైన గౌరవం దక్కించుకున్నారు భారత సంతతి శాస్త్రవేత్త యూసఫ్ హమీద్.
కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం లోని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కు భారతీయ శాస్త్రవేత్త, సిప్లా ఔషద దిగ్గజ కంపెనీ అధినేత అయిన యూసఫ్ హమీద్ పేరును పెట్టారు.
యూసఫ్ హమీద్ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కి చెందిన క్రిస్ట్ అనే కాలేజీలోనే విద్యను అభ్యసించారు.సుమారు 66 ఏళ్ళ పాటు ఈ విశ్వవిద్యాలయం తో అనుభందాన్ని కొనసాగిస్తున్న యూసఫ్.
కెమిస్ట్రీ విభాగానికి దాతగా వ్యవహరిస్తున్నారు.ఈ డిపార్ట్మెంట్ పెట్టిన ఈ పేరు 2050 వరకూ ఉంటుందని యూనివర్సిటీ తెలిపింది…ఇదిలాఉంటే

యూసఫ్ తండ్రి ముంబై లో మొట్టమొదటి సారిగా సిప్లా కంపెనీని మొదలు పెట్టారు.ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతి తక్కువ ఖర్చుతోనే హెచ్ఐవీ మందులు సరఫరా చేయడంతో ఈ కంపెనీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది.ఆయన తండ్రి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2005 లో పద్మభూషణ్ తో సత్కరించగా కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం కు యూసఫ్ అందించిన సేవలకు గాను ఆ విశ్వవిధ్యాలయం యూసఫ్ ను ఈ విధంగా సత్కరించుకుంది.